హర్షణీయం గురించి!

ఈ వెబ్సైటు / పాడ్కాస్ట్ ద్వారా తెలుగు కథను పాఠకులకు ఇంకా దగ్గరగా తీసుకురావటమన్నది, మా ఆకాంక్ష.

హర్షణీయంలో నేను రాసిన కథలన్నీ ‘హర్ష కథలు ‘ కింద ప్రచురించాము.

హర్షణీయం‘ లో ‘ప్రసిద్ధ కథకులు ‘ . అనే శీర్షిక ద్వారా మేము తెలుగు కథా ప్రపంచంలోని గొప్ప రచయితలని, వారి రచనల ద్వారా, ఇంటర్వ్యూలతో , కథా సమీక్షలతో మీకు పరిచయం చేయాలనే , ప్రయత్నం చేస్తున్నాము. తమ కథలను ప్రచురించడానికి, ఇంటర్వ్యూలకు సహకరిస్తున్న రచయితలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

సంభాషణలు‘ అనే శీర్షిక క్రింద, ప్రసిద్ధ తెలుగు కథా రచయితలతో జరిగిన సంభాషణలు పొందుపరచాము, అలాగే కొన్ని కథాసమీక్షలు కూడా.

వెబ్సైటు చక్కగా డిజైన్ చేసి ఇచ్చిన మిత్రుడు హర్ష దేవులపల్లి కి, లోగో ని ఆకర్షణీయంగా డిజైన్ చేసి ఇచ్చిన మిత్రుడు నరేష్ కి కృతజ్ఞతలు.

కథల ఎంపిక లో, సంకలనాల ఎంపికలో , ఎన్నో విలువైన సూచనలిస్తున్న, శ్రీయుతులు పతంజలి శాస్త్రి గారికి , మధురాంతకం నరేంద్ర గారికి, వాసిరెడ్డి నవీన్ గారికి, ఛాయా కృష్ణమోహన్ గారికి, మందలపర్తి కిషోర్ గారికి, నవోదయా పబ్లికేషన్స్ రథసారధులు , సాంబశివరావు గారికి , కోటేశ్వరరావు గారికి, వెంకట శిద్ధారెడ్డి గారికి, మహి గారికి, ‘నల్లగొండ’ మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు..

అందుబాటులోలేని కొన్ని కథా సంకలనాల, కథల కాపీలను , హర్షణీయంకు అందిస్తున్న అనిల్ బత్తుల గారికి, పల్లవి వెంకట నారాయణ గారికి , అత్తలూరి నరసింహారావు గారికి, లోగిలి మణికంఠ గారికి, కథానిలయం సుబ్బారావు గారికి,మనసు రాయుడు గారికి, మోదుగుల రవికృష్ణ గారికి కృతజ్ఞతలు.

ఇదిగాక ‘హర్షణీయం’ మొదలు పెట్టినప్పట్నుంచీ, ఈ కథలు చదివి పెట్టి , ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ, నా వేవేల నమస్సుమాంజలులు.

మీరు మీ ‘హర్షణీయం’ సభ్యత్వం నమోదు చేసుకోడానికి, సైడ్ బార్ మెనూ లో, ప్రతి పోస్ట్ కింద చోటు కల్పించడం జరిగింది.

హర్షణీయం ’ ని మీరిప్పుడు ‘ గానా’ ‘ఆపిల్ ఐట్యూన్స్‘ ద్వారా , ‘స్పాటిఫై‘ ద్వారా వినవచ్చు.

అలాగే ‘ఫేస్ బుక్ ‘ , ట్విట్టర్’ లేదా ‘ఇంస్టాగ్రామ్‘ ద్వారా అనుసరించవచ్చు.

మమ్మల్ని మెయిలు ద్వారా సంప్రదించ తలచుకుంటే, మీరు ‘ harshaneeyam@gmail.com ‘ ద్వారా సంప్రదించవచ్చు.

చివరిగా , ‘హర్షణీయం‘ చక్కటి ‘తెలుగు కథల’ కి అత్యున్నత వేదిక కావాలని, మా హర్షణీయం జట్టు సభ్యులందరి ఆకాంక్ష.

మేము మా ఆకాంక్ష నెరవేర్చుకునే దిశలో ప్రయాణం చెయ్యడానికి, మీరు హర్షణీయాన్ని , క్రమం తప్పకుండా చదివి, విని, మీ తెలుగు కథా సదభిమాన స్నేహితులకి పరిచయం చేసి, వెబ్ సైట్ బాగోగులు మాకు తెలియపరచమని మా ప్రార్థన.

– మీ హర్ష.

  • Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.

మా పాఠకుల అభిప్రాయాలు :

మిత్రులు శ్రీ.రామానుజం గారు.

హర్షణీయ – ప్రపంచం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s