నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా. నా బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని … నా కథల వెనుక అసలు కథ !ని చదవడం కొనసాగించండి
‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారు
రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి … ‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారుని చదవడం కొనసాగించండి
‘ట్రిగ్గర్’
https://player.captivate.fm/episode/684c5509-4f7f-45b1-b1ed-95d3a4d39066 ట్రిగ్గర్ అశోకరాజు సోఫాలో కూచుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసాడు. ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు. జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందచేస్తున్నారు. దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ … ‘ట్రిగ్గర్’ని చదవడం కొనసాగించండి
‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.
ఛాయా మోహన్ గారు రాసిన కథ ఇది. స్వింగ్ ----------------------------- వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా ఉంది. చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు. … ‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.ని చదవడం కొనసాగించండి
‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచి
'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'. శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో … ‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచిని చదవడం కొనసాగించండి
‘రామేశ్వరం కాకులు’
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ' రామేశ్వరం కాకులు' పుస్తకం లోనిది. పుస్తకం కొనాలంటే - https://amzn.to/3rDN1YM రామేశ్వరం కాకులు : వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు … ‘రామేశ్వరం కాకులు’ని చదవడం కొనసాగించండి
‘తెరిచున్న కిటికీ’
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’ (https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window) “అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప … ‘తెరిచున్న కిటికీ’ని చదవడం కొనసాగించండి
‘ఒంటరి – జోడి’
కథా మూలం అమెరికన్ రచయిత షేర్ వుడ్ ఆండర్సన్ రాసిన - ‘బ్రదర్స్’ (https://americanliterature.com/author/sherwood-anderson/short-story/brothers) రచయిత గురించి - మొదటి రెండవ ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో రచనలు చేసిన షేర్ వుడ్ ఆండర్సన్, విలియం ఫాక్నర్, హెమింగ్వే లాటి రచయితలకి అభిమాన కథా రచయిత. మొదటి పారిశ్రామిక విప్లవం వల్ల పట్టణాల, గ్రామాలలో నివసించే ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందుల గురించి మానసికంగా విశ్లేషిస్తూ అనేక కథలు రాసారు. ఒంటరి జోడి (Brothers - Sherwood … ‘ఒంటరి – జోడి’ని చదవడం కొనసాగించండి
వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)
' వర్షంలో పిల్లి' , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన 'Cat in the Rain'. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు. ‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం - పతంజలి శాస్త్రి (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం - ఎర్నెస్ట్ హెమింగ్వే) ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. … వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)ని చదవడం కొనసాగించండి
పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !
అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో - విభో - కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ నండూరి రాజగోపాల్ గారు పతంజలి శాస్త్రి గారిపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక కై … పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !ని చదవడం కొనసాగించండి
పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర
అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో - విభో - కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష. కథలో పాఠకుడి పాత్ర “ నేను రాసేటప్పుడు అంతా … పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్రని చదవడం కొనసాగించండి
కూపే
‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’) అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం. సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. … కూపేని చదవడం కొనసాగించండి
ఆశ – ఆశంక
ఆశ - ఆశంక : వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. మొహంలోకి పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది. ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను. ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి ఇంటికి … ఆశ – ఆశంకని చదవడం కొనసాగించండి
‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!
నల్లజర్ల రోడ్డు 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. - http://bit.ly/tilaknavodaya ' “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. … ‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!ని చదవడం కొనసాగించండి
అనుకున్నదొకటీ: హర్ష
"అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా" అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య "ఏంది చిన్నాయన మందల" అంటూ పలకరించా. "నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ … అనుకున్నదొకటీ: హర్షని చదవడం కొనసాగించండి
ఖదీర్ బాబు గారి ‘గేట్’!
'గేట్' ఖదీర్ బాబు గారి రచన. ' గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ' దర్గామిట్ట కథలు ' , ' న్యూ బాంబే టైలర్స్ ' , ' పోలేరమ్మ బండ … ఖదీర్ బాబు గారి ‘గేట్’!ని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : నవల పూర్తి యాభై భాగాలు !
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. స్పాటిఫై యాప్ ద్వారా వినడానికి - https://open.spotify.com/show/0E9aKYhZO3jEOwdinpoG8D ఆపిల్ యాప్ ద్వారా వినడానికి - … ‘వనవాసి’ : నవల పూర్తి యాభై భాగాలు !ని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 17-30 భాగాలు 
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక పదిహేడో భాగం నించి ముప్ఫయవ భాగం ఇపుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.
‘వనవాసి’ : 16 వ భాగం
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక పదహారో భాగం ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.
వనవాసి ధారావాహికలో భాగంగా పర్యావరణంపై ప్రసంగాలు.
అరణ్యాలు ( శ్రీ డీ వీ గిరీష్ ) , చిత్తడినేలలు ( శ్రీ. రితేష్ కుమార్ ) , మడ అడవులు ( కుమారి అజంతా డే ) , సముద్రాలు ( శ్రీ వివేకానందన్ ), - ఆంగ్లంలో
హిమాలయ పర్యావరణం – మానసీ అషేర్ గారు ఆంగ్లంలో
వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు. ఇంకొన్ని వివరాల కోసం : https://www.himdhara.org/ https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas
తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్టు – లెప్చా ఆదివాసీలు (ఆంగ్లంలో)
వనవాసి ధారావాహిక లో భాగంగా ఈ ఎపిసోడ్లో , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు.
‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్ష
వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది. ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది. దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో … ‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్షని చదవడం కొనసాగించండి
నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయం
' వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి , పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి … నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయంని చదవడం కొనసాగించండి
పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపై
హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం … పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపైని చదవడం కొనసాగించండి
విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ
హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ … విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 14-15 భాగాలు
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక 14, 15 భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది. ఈ … ‘వనవాసి’ : 14-15 భాగాలుని చదవడం కొనసాగించండి
వనవాసి – శ్రీ ఆలోక్ శుక్లా గారితో ఇంటర్వ్యూ కోల్ మైనింగ్ దుష్ప్రభావాల గురించి.
వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది.ఇందులో భాగంగాఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' … వనవాసి – శ్రీ ఆలోక్ శుక్లా గారితో ఇంటర్వ్యూ కోల్ మైనింగ్ దుష్ప్రభావాల గురించి.ని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 11-13 భాగాలు
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక 11 నించి 13భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది. ఈ … ‘వనవాసి’ : 11-13 భాగాలుని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 6-10 భాగాలు
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక 6 నించి 10 భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది. … ‘వనవాసి’ : 6-10 భాగాలుని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 1 – 5 భాగాలు
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి నవల మొదటి ఐదు భాగాలు ఇప్పుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది. ఈ నవల … ‘వనవాసి’ : 1 – 5 భాగాలుని చదవడం కొనసాగించండి
‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం
ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,'ఆత్మనొక దివ్వెగా' నవల , 'సెలయేటి సవ్వడి' కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.
ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచన
కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు. ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత … ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచనని చదవడం కొనసాగించండి
కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష
కె.సభా (జూలై 1, 1923 - నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో. నరేంద్ర గారికి కృతజ్ఞతలు. సభా గారి కథలు … కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్షని చదవడం కొనసాగించండి
అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!
మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదుకున్న. నాకు అంకెలు బాగానే వొచ్చు, ఐదవ తరగతేమయిందనేగా మీ అనుమానం, చాలా ఎక్కువ చదివేసాననుకొని ఐదుని ఎత్తేసి ఆరులో చేరిపోయా.
‘మనిషి లోపలి విధ్వంసం’ – అల్లం రాజయ్య గారి రచన
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన 'మనిషి లోపలి విధ్వంసం' ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు. ఈ కథ వారి కథా సంపుటి, ' అతడు' లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxP అదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. … ‘మనిషి లోపలి విధ్వంసం’ – అల్లం రాజయ్య గారి రచనని చదవడం కొనసాగించండి
త్రిపుర గారి ‘పాము’
‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు.
కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారికి కృతజ్ఞతలు.
కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది.
పుస్తకం కొనాలంటే - https://bit.ly/3mAwFhN
‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం
ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .
పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .
పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) .
తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత. శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.
అర్నాద్ గారి ‘రిక్షా ప్రయాణం’
ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన 'రిక్షా ప్రయాణం'. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు. "అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, … అర్నాద్ గారి ‘రిక్షా ప్రయాణం’ని చదవడం కొనసాగించండి
‘షరా’ గోపీచంద్ గారి రచన
'షరా' గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ఈ కథ 'గోపీచంద్ రచనా సర్వస్వం - కథలు - 2 ' లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని … ‘షరా’ గోపీచంద్ గారి రచనని చదవడం కొనసాగించండి
‘పేపర్ టైగర్’ కథ – వాసిరెడ్డి నవీన్ గారి ముందు మాటతో
ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. ముందుగా ఈ కథ గురించి ' కథా' నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. "ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!" అన్నారు నరసింహం గారు, … ‘పేపర్ టైగర్’ కథ – వాసిరెడ్డి నవీన్ గారి ముందు మాటతోని చదవడం కొనసాగించండి
ఎన్ ఎస్ ప్రకాశరావు గారి గురించి వారి సహచరి డాక్టర్ నళిని గారు!
ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. వారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు ఈ ఎపిసోడ్ లో మాట్లాడతారు. డాక్టర్ నళిని గారికి కృతజ్ఞతలు.
రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. 'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - https://amzn.to/3BzBpsO హర్షణీయం ఇంటర్వ్యూ మీరుఎంతకాలంనించీకథలురాస్తున్నారు? … రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణని చదవడం కొనసాగించండి
ది ఫ్రెండ్స్ – ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన
ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.
స వెం రమేష్ గారితో హర్షణీయం
స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.
స వెం రమేష్ గారి ‘ఉత్తర పొద్దు’ – ప్రళయ కావేరి కథలు నుంచి
'ప్రళయకావేరి కథలు'రచయిత స.వెం.రమేశ్ ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి ఆయన కార్యక్రమం. తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగువాణి' (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నాడు.
మా ఊరి నీళ్ల పురాణాలు – హర్ష
పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద, ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో, అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో, తవ్వితే పడేది మాత్రం ఉప్పునీళ్ళే. నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ … మా ఊరి నీళ్ల పురాణాలు – హర్షని చదవడం కొనసాగించండి
తడిసిన నేల
ముందు ఉన్న సీట్లు , ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో వెనకనించీ ముందుకెళ్తున్నాడు రెడ్డి. లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో, నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న వాన చినుకులు హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది. డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”? “ వానలు గదా …. రోడ్డుగూడా, … తడిసిన నేలని చదవడం కొనసాగించండి
నిర్మల మొగుడు – తిలక్ గారి కథ:
నిర్మల మొగుడు కథ రాసింది, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. సంగ్రహించింది 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. - http://bit.ly/tilaknavodaya
సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష
అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పడి పొయ్యేనా, అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్, అలాగే … సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్షని చదవడం కొనసాగించండి
వఱడు – అల్లం శేషగిరి రావు గారు
'వఱడు ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిదిపొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగిందిఅటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.
‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారు
'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి. 'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన … ‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారుని చదవడం కొనసాగించండి
‘పేరులోనేమున్నది’ – హర్ష
"రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా!, ఆడుకుందాం!" అని కేక వేశా నేను. మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి, ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి … ‘పేరులోనేమున్నది’ – హర్షని చదవడం కొనసాగించండి
‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు
'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. సుధాకర్ గారి 'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది. మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ. మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల. 'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో … ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారుని చదవడం కొనసాగించండి
‘ ది బ్లూ అంబ్రెల్లా’
పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల. ఈ పుస్తకంనించి, ' ది బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు. ' The Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్. అనిల్ గారు … ‘ ది బ్లూ అంబ్రెల్లా’ని చదవడం కొనసాగించండి
పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం
అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి … పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయంని చదవడం కొనసాగించండి
కథానవీన్ గారితో హర్షణీయం Part – II
కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ' ప్రజాసాహితి' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన … కథానవీన్ గారితో హర్షణీయం Part – IIని చదవడం కొనసాగించండి
‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన
రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు. ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి. కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే … ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచనని చదవడం కొనసాగించండి
‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.
'సంపెంగ పువ్వు' గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ముందుగా, రజని గారు గోపీచంద్ గారి … ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.ని చదవడం కొనసాగించండి
‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది. పుస్తకం కొనడానికి కావాల్సిన web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని … ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన.ని చదవడం కొనసాగించండి
‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు
హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది. … ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారుని చదవడం కొనసాగించండి
వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’
హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు. సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు. … వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’ని చదవడం కొనసాగించండి
కథానవీన్ గారితో హర్షణీయం Part – I
‘కథానవీన్' గారితో హర్షణీయం ఇంటర్వ్యూలో హర్షణీయం టీం తో బాటూ, ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు పాల్గొనడం జరిగింది. నవీన్ గారికి, నరేంద్ర గారికి కృతజ్ఞతలు. కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. 'ప్రజాసాహితి ' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు … కథానవీన్ గారితో హర్షణీయం Part – Iని చదవడం కొనసాగించండి
‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని … ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!ని చదవడం కొనసాగించండి
రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి
తన డెబ్భైయ్యో ఏట రచనలు మొదలుపెట్టి తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలను అత్యంత ప్రతిభావంతంగా తన రచనల్లో చిత్రీకరించిన దేవులపల్లి క్రిష్ణమూర్తి గారు , ఈ ఇంటర్వ్యూలో తన రచనల గురించి , తనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేక విషయాల గురించీ, సాహితీలోకంలో తన పరిచయాల గురించీ వివరించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం యువ కథా రచయిత మల్లికార్జున్ , హర్షణీయం టీం తో బాటూ క్రిష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం. క్రిష్ణమూర్తి … రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సిని చదవడం కొనసాగించండి
వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!
సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు. ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడతారు. వారివురికీ … వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!ని చదవడం కొనసాగించండి
‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల . ఎపిసోడ్లో … ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!ని చదవడం కొనసాగించండి
‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన
‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది. తన మూలాలను వెతుక్కుంటూ ఒక మహిళ చేసే ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత. విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన ‘ మూడు బీర్ల తర్వాత’ ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి. పుస్తకం కొనడానికి కావాల్సిన web link …. https://bit.ly/3d4M0lv … ‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచనని చదవడం కొనసాగించండి
‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన
చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ … ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచనని చదవడం కొనసాగించండి
మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !
ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు. తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు … మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి
‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !
నవలా రచయితగా లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి 25 ఎంపిక చేసిన కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా.... రాముడొస్తున్నాడోయ్ '. ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ … ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !ని చదవడం కొనసాగించండి
‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!
'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది. ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/patanjali-sahityam-1 తోటి వేటగాళ్లు కథపై శ్రీ మందలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి కృతజ్ఞతలు. తోటి వేటగాళ్ళు ! బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో. దానినీ , … ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!ని చదవడం కొనసాగించండి
‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ
'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి క్రింది ఉన్న లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/sri-channel-2 బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు. ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు. ఒంగిపోకపోయినా నిలువెల్లా వార్థక్యం తెలుస్తూనే ఉండేది. బ్రాహ్మణ వీధిలో ఉన్న పది … ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథని చదవడం కొనసాగించండి
‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే,, మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. … ‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’ని చదవడం కొనసాగించండి
‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారు
'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు. మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది. మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, … ‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారుని చదవడం కొనసాగించండి
‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
'ఎదారి బతుకులు' రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు. ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు. గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా 'వెలుగు' మహిళా సంఘాల (SERP - సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక 'నవోదయం'లో విలేఖరి గా పనిచేస్తున్నారు. ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు … ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి
‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ
హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు … ‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథని చదవడం కొనసాగించండి
సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!
2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 'సింగమనేని … సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!ని చదవడం కొనసాగించండి
పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?
ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్ళ జర్నీ … పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?ని చదవడం కొనసాగించండి
హర్ష రాసిన ‘ఎండమావి’ – సారంగ పత్రిక నుంచి!
ఈ కథ ' ఎండమావి' హర్ష రాసింది , సారంగ' వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. కథ చదవడానికి - https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/ 'హర్షణీయం' పాడ్కాస్ట్ ని 'గానా' (Ganaa) అప్ ద్వారా వినాలంటే -https://gaana.com/podcast/harshaneeyam-season-1 స్పాటిఫై యాప్ లో వినాలంటే -http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే -http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast) హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి -harshaneeyam@gmail.com కు మెయిల్ లేదా '77807 43545 ' అనే … హర్ష రాసిన ‘ఎండమావి’ – సారంగ పత్రిక నుంచి!ని చదవడం కొనసాగించండి
ఎండపల్లి భారతి గారి ‘ఎదారి బతుకులు’ పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!
ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు. ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు. మార్చి నెలాఖరున భారతిగారి తో ఇంటర్వ్యూ హర్షణీయంలో మీరు వినవచ్చు. 'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDj
‘అహింస’ దాదా హయత్ గారి కథ!
'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై … ‘అహింస’ దాదా హయత్ గారి కథ!ని చదవడం కొనసాగించండి
‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !
రచయిత పరిచయం: వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ … ‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !ని చదవడం కొనసాగించండి
‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !
ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , 'వేలుపిళ్లై' రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ … ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !ని చదవడం కొనసాగించండి
వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) 'సొట్ట ఆదిగాడు': ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి … వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!ని చదవడం కొనసాగించండి
సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!
సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ కి తమ తోడ్పాటు నందించిన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు. వంశీ గారు రాసిన 'ఆకు పచ్చని జ్ఞాపకం ' కొనడానికిhttps://www.telugubooks.in/products/aakupachani-gnaapakam?_pos=15&_sid=2844ef7ef&_ss=r 'వంశీ కి నచ్చిన కథలు' కొనడానికి - https://www.telugubooks.in/products/vamsee-ki-natchina-kathalu?_pos=13&_sid=2844ef7ef&_ss=r హర్షణీయం కు … సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!ని చదవడం కొనసాగించండి
వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !
ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట) 'పొగడ పూలు': గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు. రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి. యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే! … వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !ని చదవడం కొనసాగించండి
సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!
సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ 'వేలుపిళ్లై' అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో 'వేలు పిళ్ళై కథలు ' కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది. ************************************** 'ఏనుగుల రాయి': కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు. దొరలు … సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!ని చదవడం కొనసాగించండి
‘కే ఎన్ వై పతంజలి’ గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!
తెలుగు సాహిత్యం లోని గొప్ప రచయితలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'మోటు మనిషి ', 'తోటి వేటగాళ్లు ', 'సీతమ్మ లోగిలి ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించమని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, ఆడియో … ‘కే ఎన్ వై పతంజలి’ గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!ని చదవడం కొనసాగించండి
డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు. చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. వాసిరెడ్డి నవీన్ గారి గురించి: 'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో … డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!ని చదవడం కొనసాగించండి
‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!
నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మొదటి భాగం: రెండవ భాగం: https://atomic-temporary-173223651.wpcomstaging.com/2021/01/16/nallagonda/ https://atomic-temporary-173223651.wpcomstaging.com/2021/01/21/nalgonda-comments/ Powered by Hindenburg
‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ
ఈ కథ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది. నైట్ డ్యూటీ “ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్” ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంజ్ లూ , మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సిలిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ … ‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథని చదవడం కొనసాగించండి
‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయం
"The dream reveals the reality which conception lags behind, that is the horror of life and the terror of art" - Franz Kafka (1883-1924) కథ స్థూలంగా: కథలో పాత్రధారులు, భార్య , భర్త , ఓ ఐదేళ్ల కూతురు. కథంతా ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో ఉంటుంది. భార్య ఒక పెయింటర్. ప్రతివిషయాన్నీ వ్యాపార దృక్పధం తో చూసే భర్తా, అతనితో ఆమె గడిపే అసంతృప్తికర జీవితం, … ‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయంని చదవడం కొనసాగించండి
‘నల్లగొండ కథలు’ కథాసంకలనం పై అభిప్రాయాలు !
'నల్లగొండ కథలు' కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత 'మునికాంతపల్లి' విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు.
‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
' మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం. ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కతలు - విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ -ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని … ‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.ని చదవడం కొనసాగించండి
వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’ – ‘నల్లగొండ కథలు’ నుంచి !
ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం. 2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి … వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’ – ‘నల్లగొండ కథలు’ నుంచి !ని చదవడం కొనసాగించండి
‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయం
రోహిణి' పతంజలి శాస్త్రి గారి 'రామేశ్వరం కాకులు' అనే కథాసంకలనం లోనిది. • ఈ కథపై చక్కని సూచనలివ్వడమే కాక, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు. **'రామేశ్వరం కాకులు పుస్తకం' అమెజాన్ లో దొరుకుతోంది. - http://amzn.to/3bFv5W2. కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో … ‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయంని చదవడం కొనసాగించండి
‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథ
*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు. 'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది. ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల … ‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథని చదవడం కొనసాగించండి
అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.
(*కథను ప్రచురించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.) రచయిత అల్లం శేషగిరి రావు గారి గురించి ( 1934 - 2000) - 'చీకటి' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది. 'రచన' మాసపత్రిక లో 1995 లో ప్రచురింపబడ్డ ఈ కథ, ఆయన ఆఖరి రచన. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని … అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.ని చదవడం కొనసాగించండి
‘ఆర్వీ చారి కరెంటు బిల్లు ‘ ! – పతంజలి శాస్త్రి గారి కథ
ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది. కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది. శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది. ఆర్వీచారి కరెంటు బిల్లు: లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. … ‘ఆర్వీ చారి కరెంటు బిల్లు ‘ ! – పతంజలి శాస్త్రి గారి కథని చదవడం కొనసాగించండి
సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!
Part I : part II: part III part IV హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది. హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు. ఆర్కియాలజీ … సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!ని చదవడం కొనసాగించండి
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !
తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ … ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి
‘ఇల్లు’!
ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది. చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను … ‘ఇల్లు’!ని చదవడం కొనసాగించండి
‘వడ దెబ్బ’ !
కథ పేరు 'వడ దెబ్బ'. వడ దెబ్బ “వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు. గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు. ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు. "బండ వెధవల్లారా ! బడుద్ధాయి గాడిదల్లారా … ‘వడ దెబ్బ’ !ని చదవడం కొనసాగించండి
‘నా పేరు సొంబరా’ – కథానేపధ్యం – మల్లిపురం జగదీష్ గారు.
'నా పేరు సొంబరా' కథపై ముందుగా మిత్రుడు రవికాంత్ వ్యాఖ్య, తరువాత , రచయిత జగదీష్ గారి కథానేపధ్యంపై వివరణ వినండి. 'హర్షణీయంలో సుప్రసిద్ధ రచయితల కథలు'
శ్రీరమణ గారి ‘మిథునం’ – ఫణి డొక్కా గారి స్వరాన!
కథ పేరు 'మిథునం '. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ. సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు. ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది. ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు … శ్రీరమణ గారి ‘మిథునం’ – ఫణి డొక్కా గారి స్వరాన!ని చదవడం కొనసాగించండి
‘నా పేరు సొంబరా ‘ – మల్లిపురం జగదీష్ గారు
హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా' ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.) ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకు మునుపు … ‘నా పేరు సొంబరా ‘ – మల్లిపురం జగదీష్ గారుని చదవడం కొనసాగించండి
పి.రామకృష్ణ గారి కథ – ‘దయ్యం’
'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా. ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు … పి.రామకృష్ణ గారి కథ – ‘దయ్యం’ని చదవడం కొనసాగించండి
‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!
హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం. సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి. కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక … ‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!ని చదవడం కొనసాగించండి
మా బస్సు బాగోతాలు
"ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?" "ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా" అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు. "మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని" అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట. ముందు వెనక కర్వ్డ్ … మా బస్సు బాగోతాలుని చదవడం కొనసాగించండి
శ్రీరమణీయం – నాలుగో భాగం : వారి కథా రచన
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రిక సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – నాలుగో భాగం : వారి కథా రచనని చదవడం కొనసాగించండి
శ్రీరమణీయం – మూడో భాగం : బాపురమణ గార్లు
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రిక సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – మూడో భాగం : బాపురమణ గార్లుని చదవడం కొనసాగించండి
శ్రీరమణీయం-రెండోభాగం: కవిసామ్రాట్ విశ్వనాథ
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం-రెండోభాగం: కవిసామ్రాట్ విశ్వనాథని చదవడం కొనసాగించండి
శ్రీరమణీయం – మొదటి భాగం : బాల్యం , రచనా జీవితానికి అంకురం
హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – మొదటి భాగం : బాల్యం , రచనా జీవితానికి అంకురంని చదవడం కొనసాగించండి
తిలక్ గారి కథారచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత శ్రీ మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ!
తెలుగు సాహిత్యం లోని గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం … తిలక్ గారి కథారచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత శ్రీ మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ!ని చదవడం కొనసాగించండి
తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి … తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’ని చదవడం కొనసాగించండి
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి – ‘సిలారు సాయబు’
హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం … ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి – ‘సిలారు సాయబు’ని చదవడం కొనసాగించండి
‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటి
హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన. ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది. ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు. తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , … ‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటిని చదవడం కొనసాగించండి
శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’
"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి . హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'. ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి … శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’ని చదవడం కొనసాగించండి
రావిశాస్త్రి గారి ‘వర్షం’
హర్షణీయానికి స్వాగతం. “ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది, ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది, తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది. తన రచనలకు ప్రదానం చేసిన … రావిశాస్త్రి గారి ‘వర్షం’ని చదవడం కొనసాగించండి
“గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు
'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వేంకటేశ్వరరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వేంకటేశ్వరరావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ … “గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావుని చదవడం కొనసాగించండి
దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’
తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దొంగ' - … దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’ని చదవడం కొనసాగించండి
శ్రీరమణ గారు – బంగారు మురుగు
https://www.amazon.in/MITHUNAM-TELUGU-PB-Sri-Ramana/dp/8172869436/ref=sr_1_8?dchild=1&keywords=midhunam&qid=1602989718&sr=8-8 తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు. బంగారు మురుగు - శ్రీ రమణ గారు రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది. ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో … శ్రీరమణ గారు – బంగారు మురుగుని చదవడం కొనసాగించండి
‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.
రచయిత పరిచయం: తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష, సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన … ‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.ని చదవడం కొనసాగించండి
హర్షణీయంలో ‘చినుకు’ల చిరుజల్లు!
హర్షణీయం వెబ్సైటు మొదలై ఆరు నెలలు కావస్తున్నది. మొదటి నెలలో ఇరవై పాఠకుల తో ఆరంభించి , ఈరోజు పబ్లిష్ చేసిన ప్రతి కథనూ, పన్నెండు దేశాలలో వున్న ఐదువందల మందికి పైగా పాఠకులు చదవడం జరుగుతోంది. మీ అందరి ప్రోత్సాహానికి హర్షణీయం జట్టు హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తోంది. కేవలం 'తెలుగు భాష పై ప్రేమ' అనే మాకున్న ఏకైక అర్హత తో మేము ఈ ప్రయత్నాన్ని ఆరంభించాము. ఈ ఆరునెలల చిన్ని ప్రయాణం లో … హర్షణీయంలో ‘చినుకు’ల చిరుజల్లు!ని చదవడం కొనసాగించండి
హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – రెండవ భాగం
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచనాశైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధారెడ్డి … హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – రెండవ భాగంని చదవడం కొనసాగించండి
హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – మొదటి భాగం
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచనాశైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధారెడ్డి … హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – మొదటి భాగంని చదవడం కొనసాగించండి
హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలు
డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను పై ఆడియో ద్వారా మీరు వినవచ్చు. ఇంటర్వ్యూ లింక్ ని కూడా క్రింద ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇదే పేజీలో క్రింది భాగంలో … హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలుని చదవడం కొనసాగించండి
హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా. ఈ పుస్తకం మొదటి రెండో … హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !ని చదవడం కొనసాగించండి
‘ఓ హెన్రీ స్టోరీ’ – వెంకట్ శిద్ధారెడ్డి గారి ‘సోల్ సర్కస్’ కథాసంకలనం లోంచి!
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది. వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. 2019 వ సంవత్సరంలో … ‘ఓ హెన్రీ స్టోరీ’ – వెంకట్ శిద్ధారెడ్డి గారి ‘సోల్ సర్కస్’ కథాసంకలనం లోంచి!ని చదవడం కొనసాగించండి
మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!
"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు "తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు. "నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి" "చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ … మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!ని చదవడం కొనసాగించండి
సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’
హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, ఏకాదశి చంద్రుడు అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు' అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది. కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా. నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా 'సితార'. ఆ సినిమాలో వంశీ గారి … సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’ని చదవడం కొనసాగించండి
‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’
ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది, ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు. ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన … ‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’ని చదవడం కొనసాగించండి
అమ్మూరు
1981 వ సంవత్సరం - చిన్నా : "అమ్మా ! నేనొచ్చేసా!" అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ. "అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది అమ్మ. "అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. … అమ్మూరుని చదవడం కొనసాగించండి
సాబువ్వ
మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది. "కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే.. నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, … సాబువ్వని చదవడం కొనసాగించండి
శ్రీ మధురాంతకం నరేంద్ర గారి ‘కాకులు గ్రద్దలు’ సంక్షిప్తకథ
'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు' కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు. ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక. కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ … శ్రీ మధురాంతకం నరేంద్ర గారి ‘కాకులు గ్రద్దలు’ సంక్షిప్తకథని చదవడం కొనసాగించండి
హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు
హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం. గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది. దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న … హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారుని చదవడం కొనసాగించండి
బెల్లంకొండ వెంకటేశ్వర్లు !
ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము ఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి. పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. … బెల్లంకొండ వెంకటేశ్వర్లు !ని చదవడం కొనసాగించండి
బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు
ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ మురళి గారి, బ్లాగ్ 'నెమలి కన్ను' పరిచయం చేస్తున్నాం. ఆయన, 2009 వ సంవత్సరం నించి తన బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. తాను స్వయంగా చక్కటి కథలను రాయడమే కాకుండా , తన బ్లాగ్ ద్వారా తెలుగు సాహిత్యంలో చక్కని కథలను, ఎన్నో సంవత్సరాలనుంచీ తన పాఠకులకు పరిచయం చేస్తున్నారు. వాటిల్లో తెలుగు కథల్లో 'స్త్రీ' పాత్రలపై విశ్లేషణ, కన్యాశుల్కం పాత్రలపై వారి వ్యాఖ్యానం ఎన్నదగినవి. అడిగిన తడవునే, తన … బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారుని చదవడం కొనసాగించండి
ఒక అన్నార్థుడి గోల!
రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా""ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ""ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో""నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు""అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను""సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ""రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా … ఒక అన్నార్థుడి గోల!ని చదవడం కొనసాగించండి
హృదయస్పందనల చిరు సవ్వడి!
ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ భాస్కర్ రామి రెడ్డి గారి, బ్లాగ్ పరిచయం చేస్తున్నాం. ఆయన, గత పది సంవత్సరాలుగా తన బ్లాగ్ ను చక్కటి, చిక్కటి తెలుగులో, 'హృదయస్పందనల చిరుసవ్వడి' పేరు తో నిర్వహిస్తున్నారు. ఆయన బ్లాగ్ కి లింకుని క్రింద ఇవ్వడం జరిగింది. హర్షణీయం పాఠకులకి, ఒక మంచి అనుభూతిని వారి రచనలు తప్పకుండా మిగులుస్తాయి. బ్లాగ్ లింక్ : http://chiruspandana.blogspot.com/2015/10/blog-post_8.html? 'పిల్లలని కనాలంటే' అనే పేరుతో తన బాల్యపు మధుర స్మృతులు … హృదయస్పందనల చిరు సవ్వడి!ని చదవడం కొనసాగించండి
మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!
"మా నాయన పేరు మీ పేరు ఒకటే, సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను" అంది మా పక్కింటి గిరిజక్క, మా నాన్నతో. "సరేనమ్మా నువ్వు ఆర్డర్ వేసింతర్వాత, కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా" అన్నారు నాన్న. మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్ భార్య గిరిజక్క. ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు. "ఏమే! మాధవీ, వాసవీ, ఇకనుంచీ, మా నాయిన్ని మీరు తాత అనే … మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!ని చదవడం కొనసాగించండి
అతిథి దేవోభవ!
కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ ".ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి … అతిథి దేవోభవ!ని చదవడం కొనసాగించండి
మా తాత రాసిన రాత!
"చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు" ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో, డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల. కాస్త … మా తాత రాసిన రాత!ని చదవడం కొనసాగించండి
నేనెక్కాల్సిన బస్సు!
"అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు" ? మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర, ఎండాకాలం. హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న. “ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!" "లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా, నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా ! బస్సొచ్చే లోపల, అక్కడ పొయ్యే … నేనెక్కాల్సిన బస్సు!ని చదవడం కొనసాగించండి
ప్రణవం – ప్రణయం – పరిణయం
చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు.
లీలా కాలనీ
తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది.. డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ. "మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ? "బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ? తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , … లీలా కాలనీని చదవడం కొనసాగించండి
పెద్దంతరం చిన్నంతరం!
"కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!" "ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!" "కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!" "ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!" నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన … పెద్దంతరం చిన్నంతరం!ని చదవడం కొనసాగించండి
అర్థాంతర ప్రయాణాలు!
అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్స్.
ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!
నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం.
అప్పుడప్పుడూ ‘ఉదయించే’ మా సుడిగాడు!
"బాస్, ఏ బ్రాంచ్ నీది", అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.
మనసున్నమా రాజు!
నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్. మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే నవాబ్ … మనసున్నమా రాజు!ని చదవడం కొనసాగించండి
చిన్నీ వాళ్ళ చంద్రత్త!
"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదట , ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు , మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి కొంచెం ఒంట్లో బాలేదట. " అన్నారు నాన్న.
మా స్నేహ రమణీయం!
మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో … మా స్నేహ రమణీయం!ని చదవడం కొనసాగించండి
దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!
నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ పాప సహాధ్యాయులు అవటం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతరాలలో కలిసే వాళ్ళము.
నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!
మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు ! నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా.
పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!
మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.
నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!
ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.
మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!
నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో. సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా … మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!ని చదవడం కొనసాగించండి
స్పర్ధయ వర్ధతే విద్య!
ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని. మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా … స్పర్ధయ వర్ధతే విద్య!ని చదవడం కొనసాగించండి
నేను, నా ఉషాయణం!
ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే.
నా మొదటి ప్రవాస జీవనానుభవం!
నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని.
పాపం, మా సీన మావ!
నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం.
మా ఉలవపాళ్ళ స్వామి!
నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం.
మా దేవళపు ఇసిత్రాలు!
నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!
నవ్వితే నవ్వండి
హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం.
స్నేహనాథుడు మా రఘునాథుడు!
మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది.
మనసున్న మారాజు!
నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్.
మా విజయ్ – “అన్న”
చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన.
కథా సరిత్సాగరం!
మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా!
మా స్నేహ రమణీయం!
మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి.
తరలి రాద తనే వసంతం
'తరలి రాద తనే వసంతం' అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది.
ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!
మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు.
మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!
నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో.
కలడు కలం డనెడు వాడు?
నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం.
స్పర్ధయ వర్ధతే విద్య!
ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్!
ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే.
కథా చక్రభ్రమణం
మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు పలు రకాల కథలు చెప్పేది, కొన్ని కథలు సందర్భాను సారంగా, మరి కొన్ని నాకిష్టమైనవవడంతో నేను పదే పదే అడిగేవి.
సన్నిధానం!
ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ. లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు. ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు. క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం. వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట. అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ్ ని కల్సి … సన్నిధానం!ని చదవడం కొనసాగించండి
మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!
ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా.
ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!
నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి.
మా జి.వి.ఎస్ మాస్టారు గారు!
జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త, విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు.
మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!
చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని.
ఇసుకే బంగారమాయెనా !
మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది.
ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!
ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు.
బలుపుకి మరియు వాపుకి తేడా చెప్పిన నా చిన్ననాటి మిత్రులు!
మా ఉప్పలపాడు గ్రామము నెల్లూరికి వాయువ్యాన మరియు ప్రత్యక్ష రవాణా సౌకర్యమున్న గ్రామాలలో ఒకటి. మా వూరు నెల్లూరు-ఉప్పలపాడు రవాణా మార్గములో ఆఖరు గ్రామము. నేను ఆరు మరియు ఏడవ తరగతులు మా ఊరుకి ముందు రెండవ గ్రామమైన పెదపుత్తేడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. మాకు కీ||శే|| మీరా రెడ్డి గారు ప్రధానోపాద్యాయులుగా ఉండేవారు, ఆయన పెదపుత్తేడు నివాసి మరియు ఆ ఊరిలో పేరుమోసిన మోతుబరి కూడా. గంజి పెట్టిన మరియు మడత … బలుపుకి మరియు వాపుకి తేడా చెప్పిన నా చిన్ననాటి మిత్రులు!ని చదవడం కొనసాగించండి
తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం!
అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను.
గొలుసుకట్టు కుబేరులు!
అవి మేము కొలరాడో లోని, డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యన కల లూయివిల్లీ అనే విరాట రాజ్యం లో నివసించే రోజులు. అక్కడ మేము గుర్తు పట్టగల లేక మమ్మల్ని గుర్తు పట్టగల తెలుగు కుటుంబాలు లేవు, తెలుగు దాకా ఏల అసలు భారతీయ కుటుంబాలే లేవు. మీ పవర్ స్టార్ రేంజ్ కాదు కానీ నేను అక్కడ ఒక అజ్ఞాత వాసిని. మా సహోద్యోగి మిత్ర కుటుంబాలన్నీ డెన్వర్ లో మేము లేకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే మాకు ఈ హర్షా గాడి పీడ వదిలింది వారాంతపు సంబురాలు జరుపుకుంటున్నారు.
హర్షణీయంలో సాహితీవనం !
హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000 దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి 5000 మార్లు దిగుమతి అయ్యాయి.
ఆవూ, దూడా చేలోనే మేస్తున్నాయి, మాలాగా !
చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది.
ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!
మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.
నా కూతుర్ల, భావప్రకటన!
నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము.
మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!
మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను.
మా బడి మిత్రుని కబుర్లు!
నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు
మరవ కూడని వారు!
నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా.
మా వాకాటి కథల్లో, సూరి గాడు!
సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది.
నాలో నేను! ఒక అవలోకనం!
ఆ మధ్య ఒకసారి మా అనీల్గాడు నాతో సంభాషిస్తూ, రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి. అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగు పడాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంతా కరుగ్గా కాదు, కాస్త మెతగ్గా, ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగు పరుస్తాయని.
మనకీ మందులున్నాయబ్బా!
చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి.
గడ్డు కాలంలో నాతో నేను!
ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని.
మా వాకాటి కథల్లో అశోక్ గాడు!
మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత వరకు మేమే ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు.
మన వాకాటి కథల్లో గోపీగాడు!
ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక సంపుటిగా తీసుకొద్దాము అని.
మా వాకాటి కథలకు కొనసాగింపు!
"ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్ చేశాము", అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .
మా వాకాటి కథలు
నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం
మా (కానీ) సత్యం!
నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.
మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం
నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు.
మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం
ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది.
నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!
నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో
నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురుంచి!
నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే … నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురుంచి!ని చదవడం కొనసాగించండి
మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!
నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా.
నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!
ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను.
నా శాసనోల్లంఘనల పర్వం!
వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని నేనూ ఉల్లంఘించాను పలుమార్లు.
రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!
నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో పడాల్సిందే. పండగలొస్తే నిప్పట్లు వొత్తాలంటే రవణయ్యే, కట్టెలు పేళ్ళుగా చీల్చాలంటే రవణయ్యే, భోజనంలో సింహభాగం కూడా ఆయనదే.
మా ఉలవపాళ్ళ స్వామి!
నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక … మా ఉలవపాళ్ళ స్వామి!ని చదవడం కొనసాగించండి
అబద్దం, నిప్పులాంటిది!
అబ్బాయిల్లారా! మీకు అబద్ధం చెబితే ఎలా దొరికి పోతామో అన్నదానిమీద నా అనుభవం చెప్తా. ఈ మధ్య కాలం లో నా క్లాసుమేట్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది తను ఒక శనివారం ఉదయాన నాలుగు గంటలకు శంషాబాద్ లో దిగుతున్నానని, వచ్చి తనని తీసుకెళ్లి వాళ్ళ మేనమామ ఇంట్లో దిగపెట్టమని. తెగ ఆలోచించేసా ఆ టైంలో ఇంట్లో ఏమి చెప్పి వెళ్లాలా అని. మీకా డౌట్ వద్దు ఆడ స్నేహితమా లేక మగ స్నేహితమా అని. … అబద్దం, నిప్పులాంటిది!ని చదవడం కొనసాగించండి
ఎంత వరకూ తిట్టగలదో, చెప్పకనే చెప్పిన మా చిన్నది!
మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. … ఎంత వరకూ తిట్టగలదో, చెప్పకనే చెప్పిన మా చిన్నది!ని చదవడం కొనసాగించండి
అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి!
ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు.
ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!
నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక … ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!ని చదవడం కొనసాగించండి
నా మొదటి ప్రవాస జీవనానుభవం!
నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్ కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా … నా మొదటి ప్రవాస జీవనానుభవం!ని చదవడం కొనసాగించండి
మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!
నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం.
దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!
నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు … దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!ని చదవడం కొనసాగించండి
ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి!
నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం.
నాకున్నూ, నా పిల్లలకున్నూ, ఓ రోజు జరిగిన సంభాషణ!
నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు.
నేను, నా మనవడూ!
మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు.
మా అమ్మ తప్పిపోయింది, నా చిన్నప్పుడు!
అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి.
మా అనీల్గాడన్నట్టు, ఈ కథలో ఏముంది ట్రాఫిక్ గోల తప్ప!
మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు … మా అనీల్గాడన్నట్టు, ఈ కథలో ఏముంది ట్రాఫిక్ గోల తప్ప!ని చదవడం కొనసాగించండి
స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!
నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది, ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బ నానుకొని ప్రహరీ, ప్రహరీకి ఆవల పంట పొలాలు.
నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!
నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది.
నా సహోద్యోగులు, హాస్యచతురులు !
మనం వారంలో ఐదురోజులు మరియు రోజుకి కనీసం ఎనిమి గంటలు ఆఫీసుల్లో గడిపేస్తాం. మన కొలీగ్స్ లో హాస్యచతురత ఉంటే పని ఒత్తిడిని తట్టుకోవచ్చు. చతురత దండిగా వుండే ఒకానొక కొలీగ్ సామ్ ప్రదీప్. అప్పుడప్పుడు కలిసి భోజనానికి వెళ్తాము.
నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!
మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు ! నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ … నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!ని చదవడం కొనసాగించండి
మా లాటి ఎర్ర బస్సు జంటను, ఎక్కడన్నా కాంచారా!
నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను.
మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!
అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని.
లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!
నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు.
క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే!
నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఎదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి.
చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని కథ చెపుతాను శ్రమ తెలీయకుండా విను", అంటూ ఇలా చెప్పసాగాడు.
మా పంచింగ్ ఫలక్ నామ!
నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది.
మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!
మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.
ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!
మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్ లో వర్క్ చేయటం లేదు అని అర్థం.
అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !
ఒరే హర్షాగా! "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ.
మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!
మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పటిలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ చదివాడు, హిందీ ప్రచారసభ వారి విశారద కూడ ఫ్యాన్ అయ్యాడు. అప్పటిలో నెల్లూరు లో ఓ చిరుద్యోగి ఆయన.
అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!
మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని … అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!ని చదవడం కొనసాగించండి
బుడ్డ వెంకన్న, మళ్ళీ పుట్టాడు!
బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై, కొంచెం వొంగినట్టుండి, ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు.
నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!
ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు.
వినదగు నెవ్వరు చెప్పిన !
మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది.
నేనూ, నా మైనర్ సర్జరీ!
ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు గా కళ్ళ ముందు కనపడటం మొదలయ్యింది.
నేను, నా ఉషాయణం!
ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల … నేను, నా ఉషాయణం!ని చదవడం కొనసాగించండి
జన జీవన స్రవంతి !
చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే. దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు . చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా. అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది. ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి. మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య … జన జీవన స్రవంతి !ని చదవడం కొనసాగించండి
‘గ్యాపకాలు’ – హర్ష
"భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు.లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని … ‘గ్యాపకాలు’ – హర్షని చదవడం కొనసాగించండి