కథా సరిత్సాగరం!

మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా!

మాకు కథలు చెప్పటం అనేది, తన రోజూ వారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ.

కానీ మేము అడిగిన ప్రతీసారీ ఆవిడ, తన దగ్గరినించీ ఈ కథలు, అంత తేలిగ్గా బయటకి తీసేది కాదు.

ఒక్కోసారి ముందుగా పొడుపు కథలు చెప్పేది.

అంటే, పొడుపు కథ మేము విప్పితే గానీ అసలు కథ బయటకి రాదన్నమాట.

ఇదంతా అయ్యిన తర్వాత, ఆమె కథ చెప్పడానికి రెడీ అయితే బోనస్, లేక పోతే ఆవిడ, ఆ పొడుపు కథనే ఆరోజుకి పొదుపుగా వాడేసుకుంది , అని మేము అర్థం చేసుకోవాలి.

అలా ఆవిడ తన అమ్ముల పొదిలో వున్న కథలను, విరివిగా వాడకుండా, విడతల వారీగా మాత్రమే, బయటకి తీసేది.

మేము కూడా ఆవిడ చేత కథ చెప్పిచ్చుకోవడానికి,

వంకర టింకర శొ…
వాని తమ్ముడు అ…
నల్ల గుడ్ల మి…
నాలుగు కాళ్ళ మే…


తోకలేని పిట్ట తొంబై మైళ్ళు…
తొడిమలేని పండు, ఎన్నటికీ వుండు…

లాటి పొడుపు కథలు రాగయుక్తంగా పాడుకుంటూ సమాధానాలకు తెగ ఆలోచించేసి, మా చిన్న బుర్రల్ని సాన పెట్టేసి, నానా కష్టాలూ పడే వాళ్ళం.

కథల కోసమని చెప్పి, పగలంతా ఆవిడ పనుల్లో సహాయం చేస్తూనో, ఆవిడకి కావాల్సి వస్తువులు అంగడికి వెళ్లి వెంటనే తెచ్చి పెట్టడమో ……… ఇట్టా పొద్దస్తమానం ఆవిడ చుట్టూనే తిరిగేవాళ్ళం.

‘లలిత’ గుండాయన చెప్పినట్టు జీవితంలో ఏదీ వూరికే రాదనీ, మాకప్పుడే అర్థమయ్యేట్టు చేసింది మా అమ్మమ్మ.

ఆఖరికి, సాయంకాలం ఆటలకి వెళ్లిన మేము, మేతకెళ్లిన పశువులు ఊర్లో అడుగెట్టక ముందే, వెన్కక్కొచ్చేసి, తద్వారా ఆవిడని సంతోషపెట్టి, కథలు సాధించుకునేవాళ్ళం.

ఈ సందర్భంగా చెప్పాలంటే, ఆవిడ కి మా గురించి చాలా భయాలు ఉండేవి,

పశువులు తిరిగి ఇళ్లకు వచ్చే వేళ, మేము వాటి మధ్యలో పడి నలిగి పోతామనో,

మేము ఆటల్లో పడి, పశువుల కోసం ఉంచిన కుడితి తొట్లల్లో పడి పోతామనో ఇలా రక రకాలుగా.

మేము ఆటల్నించి రావడం ఒక పది నిముషాలు లేట్ అయినా, మమ్మల్ని, వెతుక్కుంటూ ఆవిడే ఊర్లోకి వచ్చేసేది.

అలా వచ్చినప్పుడు మేము కానీ కనపడక పోతే వెళ్లి అమాంతం గా అన్నీ కుడితి తొట్లల్లో చేతులు పెట్టి దేవేసేది.

ఆవిడ మా ఊర్లో జనాల్ని అయ్యా, మా చిన్నోడిని ఎక్కడన్నా చూశారా, మా బేబమ్మ (మా అక్క ముద్దు పేరు) ఎక్కడన్నా కనపడిందా అని అడుగుతూ వెతుక్కుంటూ రావటం ………. ఎక్కడి పోతాం అమ్మమ్మా! మేము ఏమన్నా చిన్నపిల్లలమా , అని మేము ఆవిణ్ణి విసుక్కోవటం నాకు యింకా గుర్తే.

మా దోస్తులు కూడా, ఇంకా మీ అమ్మమ్మ రాలేదేమిటా అనుకుంటా వున్నాము, అనుకోంగానే దిగిపోయిందావిడ, ఇంక ఆటలు ఆపెయ్యాలి అని, మా మొహం మీదే, నిరాశతో కలిపిన వెట – కారాలు చల్లేవాళ్ళు .

మా అమ్మమ్మ చెప్పే కథలు చాలక, ఒక్కోసారి మేము మా చిన్నమ్మమ్మ దగ్గర చేరేవాళ్ళం.

మాకు కథలు చెప్పడానికి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక తెలియని పోటీ ఉండేది.

మేము మా చిన్నమ్మమ్మ చేత చెప్పించు కోవాలంటే, ప్రీ కండీషనూ, ఆవిడ కుండే తెల్లని వెంట్రుకలు మేం లాగి తీసేయటం.

కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి మా చిన్న అమ్మమ్మ, కథలు చెప్పటంలో మా అమ్మమ్మకి ఏమాత్రం తీసిపొయ్యేది కాదు.

రామాయణ, భారత కథలతో పాటు, కాశీ మజిలీ, భోజరాజు-సాలభంజికలు, బట్టి విక్రమార్కులు, మిత్ర లాభాలు, మిత్ర బేధాలు, అక్బర్ బీర్బల్, ముల్లా నసీరుద్దీన్, అలీబాబా నలభై దొంగల వంటి – కథలన్నీ, సంభాషణల తో సహా అన్నీ రకాల కథలూ – మా చిన్నమ్మమ్మ కి కొట్టిన పిండి.

ఆ కథలన్నీ వినడానికి, మాకు ఆవిడకి వుండే తెల్ల జుట్టుతో పాటు అప్పుడే నెరవడం మొదలు పెట్టిన వాటిల్ని కూడా అనవసరంగా లాగేసే వాళ్ళం.

మా చిన్నమ్మమ్మ, కథలు, వాటిలోని సంభాషణలు, చేతులు తిప్పుతూ, కళ్ళతో హావభావాలు పలికిస్తూ, చాల నాటకీయం గా చెప్పేది.

ఈ సంభాషణలు పలకటమనేది నాకు ఎంతగానో నచ్చిన అంశం.

నా కూతుర్లు కొంచెం పెద్ద అయ్యి ఊహ తెలియటం మొదలెట్టాక, నేను వాళ్ళకి సింహం, చిట్టెలుక వేటగాడు కథ చెప్పాలంటే, నేను సింహం గా, నా పెద్ద కూతురు వేటగాడిగా, నా చిన్న కూతురు చిట్టెలుకగా నటిస్తూ సంభాషణలు చెప్పటం,

అలాగే మొసలి, కోతి కథలో, , నా చిన్న కూతురు కోతి పాత్రధారిగా, , నేను మొసలిగా, ఆ కోతి గుండెని తినాలని ఆశ పడే మొసలి భార్యగా …… సుప్రియా….. సంభాషణలు చెబుతూ కథలు చెప్పుకోవటం భలే ఉండేది.

వీటితో పాటు అమెరికా లో వున్నప్పుడు లోకల్ లైబ్రరీస్ నుండి కుప్పలు తెప్పలు కథల పుస్తకాలు తెచ్చే వాళ్ళము. వాటిల్లో మా వాళ్లకు చాలా ప్రాణ ప్రదం, ” త్రీ లిటిల్ పిగ్స్ అండ్ ఏ బాడ్ వూల్ఫ్” కథ.

ఇక రోజూ ఆ కథే.

ఆ బాడ్ వూల్ఫ్ లాగ, “ఐ విల్ హఫ్, ఐ విల్ పఫ్ అండ్ ఐ విల్ బ్లో యువర్ హోమ్ అవే” అని నేను హఫ్ చేయలేక పఫ్ చేయలేక చచ్చే వాడిని.

హఫ్ చేయడం ఏమాత్రం తగ్గినా నా కూతుర్లు నీలో బాడ్ వూల్ఫ్ మాకు కనపడటం లేదు అని నా చేత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించే వాళ్ళు.

ఈ కథతో పాటు వాళ్ళకి “క్యూరియస్ జార్జ్”, “కాయు”, “క్లిఫోర్డ్”, “ఆర్థర్”, “బార్నీ”, “డ్రాగన్ టేల్స్”, “విన్నీ ది పూ” లాటి కథలు చదివిందే చదివిచ్చే వాళ్ళం.

మొత్తానికి ఇండియా కి వచ్చాక కూడా పిల్లలని వీడియో గేమ్స్ జోలికి పోకుండా ఏదన్న పుస్తకం చదివే అలవాటు చేశా.

ఈ కథలు చెప్పటం, చదివించటం అనే అలవాటు ……..నా పిల్లల చక్కటి భావ వ్యక్తీకరణకు, ఆలోచనల ఎదుగుదల కి, విసువల్ ఇమాజినేషన్ కి ఎంతగా ఉపయోగపడ్డాయో, వాళ్ళు కొంచెం పెద్దయ్యాక, వాళ్ళతో మాట్లాడుతున్నపుడు నాకు బాగా అర్థమయ్యేది.

పెద్దవాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులూ, చరాస్తులు, కాల క్రమేణా కరిగి పోవచ్చు.

కానీ మా అమ్మమ్మలు నా కిచ్చి వెళ్లిన ఈ కథా సంపద, తరాస్థి అని నాకనిపిస్తుంది.

ఎందుకంటే తరతరాలు ఉపయోగించినా తరగని ఆస్తి ఇది.

30 thoughts on “కథా సరిత్సాగరం!

    1. బాగుంది హర్ష.. నాకు మా నానమ్మ గుర్తు కొచ్చారు.. ఆమె 80 ఏళ్ల వయసులో కూడా కళ్లజోడు లేకుండా కాశీ మజిలీ కథలు లాంటివి చదివే వారు.. రోజు ఒక కధ ఆవిడ చేత చెప్పించు కోవడం అలవాటుగా ఉండేది..

      మెచ్చుకోండి

      1. యాదృచ్చికమనండి మా అమ్మమ్మ కూడా చనిపోయే వరకు కళ్ళజోడు లేకుండానే పుస్తకాలు చదివే వారు. ఓ రోజు ఆవిడ చిన్నోడా నాకు షోడా షోడా తెచ్చిపెట్టవా అని అడిగితే నాకు కొన్ని నిముషాలు పట్టింది అది మన మధు బాబు గారు రాసిన షాడో షాడో డిటెక్టివ్ నవల అని. అలా ఆవిడ చదవని పుస్తకమే లేదు.

        మెచ్చుకోండి

  1. అమ్మమ్మ కు మీ మీద ప్రేమను, మీకు అమ్మమ్మ మీద ప్రేమను స్పష్టంగా ఈ కథలలో చూస్తున్నాను హర్షా..

    ఇలాంటి అనుభవాలు కొద్దిగా అటూ ఇటూ చాలామందికే వుంటాయనుకుంటా…వాటిల్ని నీ జ్ఞాపకాలతో జ్ఞప్తికి తెచ్చావు…

    అది సరేగానీ… నీ కథలతో, అనిల్ గాడి హృద్యమైన వ్యాఖ్యానంతో నేను అమ్మమ్మతో ప్రేమలో పడిపోయా…ఏదైనా ఫోటో వుంటే పంచుకో మిత్రమా!

    మెచ్చుకోండి

    1. Thanks Srinivas gaaru. I applied the learnings every where. One such example was our seventh clas public exam. We were asked to write a story on a lesson that our master did not gave notes. But he gave notes on questions of that lesson. He was worried that we may not be able to write the story and he was enquiring about it during exam. I got up and told him not to worry about it, as I have an idea that we all can sequence the answers to questions on that lesson in to a story. He was very relieved on that day.

      మెచ్చుకోండి

  2. “పిల్లలని వీడియో గేమ్స్ జోలికి పోకుండా ఏదన్న పుస్తకం చదివే అలవాటు చేశా.”

    ఇది అందరివల్లా కా(లే)దు హర్షగారూ..!!
    ఇందుకు మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా అభినందించాలి..

    ఇకపోతే..
    అమ్మమ్మ, నాయనమ్మ , తాతయ్యలు మమతానురాగాలకి ఎంత పెట్టని కోటలో, అంతే నడిచే గ్రంధాలయాలు కూడా కదా!!!

    మెచ్చుకోండి

    1. కష్టమేనండి రవి గారు. నాకు ఇద్దరు బంగారు తల్లులు కాబట్టి బతికి పోయా. అదే మొగ కుంకలయ్యుంటేనా నా చేత కూడా ఆడించేవాళ్ళు. నిజమేనండి అమ్మమ్మ లు తాతయ్య లు మనకిచ్చిన తరాస్తులు ఆ కథలు. కథ చెప్పే మూడ్ లేక పోతే మా అమ్మమ్మ కథల కామరాజుకి వీపున మోకాలు అనేది మేము మిడత అనగానే , మిడత వెళ్లి చూరు ఎక్కిందనేది…చివరకి అంబులో చెంబు చెంబులో చారెడు నీళ్లు అనగానే మేము టెంకాయ అని అరిచే వారము. మధ్యలో వచ్చే వాక్యాలు మర్చిపోయా..ఎంత గుర్తుకు తెచ్చు కున్న రావటం..

      మెచ్చుకోండి

  3. బాగున్నాయండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, అనుభూతులు. ఈ కాలం పిల్లలకి పొడుపు కధలు, అమ్మమ్మ చెప్పే కధలు అంతగా ఇష్టం ఉండవేమో. మీరు మీ పిల్లలకి అవి చెప్పడం హర్షనీయం. …… మహా

    మెచ్చుకోండి

    1. చాల ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. మీ రాతలు మాకు చాలా ఇష్టాలండి. మీ అడుగు జాడలలో నడిచి ప్రద్యుమ్న కాలేక పోయిన దుష్టద్యుమ్న అవ్వాలను కుంటున్నాను అండి. నన్ను చూచిరాత పిల్లి అనుకున్న పరవాలేదండి. ఇప్పుడే మీ బాష ని డీకోడ్ చేసుకుంటున్నా. మహా అంటే మంద హాసము అని విహా అంటే వికటాట్ట హాసము ani…

      మెచ్చుకోండి

    1. thank you Ram. Aa sampradaayam mana peddalu icchina varamu..chaala marchipoyaamu…appatlo o katha vundedi “puligadu kaadu giligaadu kaadu thoka peekudugaadu” antoo entha gurthuku tecchukunna gurthuku raavatam ledu..enni picchi kathalu cheppukunna chivaralo edo neethi cheppe vaaru..

      మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s