
మన పిచ్చి రాముడు గారు రాసిన, ‘అమ్మ గురించి’ చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు “నా పిచ్చి తండ్రి” అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.
అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, “మన జీవితాల్లో కథ నాయికా నాయకులు” అని ముచ్చటలు చెప్పుకునేంత.
నాకు ఆయన రాసిన “పిన్ని అనే వరలక్ష్మి గారు” గురించి ఆవిడ కథానాయకుడికి ఏవిధంగా పిన్ని వరస అవుతారో అని ఆవిడ వ్యక్తిత్వం దెబ్బ తినకుండా సున్నితం గా చెప్పిన విధానం ఇంకా నచ్చింది.
అందుకే ఆ కథని, మా హర్షాతిథ్యం లో మా ద్వితీయ కథలాగా పరిచయం చేయాలని ఆయన అనుమతితో ప్రయత్నించాము. ఈ ప్రయత్నం లో కొత్త తనము ఆ కథని శ్రవణ రూపం లో తీసుకొని రావటం. బహుశా మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.
ఈ ప్రయత్నం వెనక మా స్వార్థం కూడా వుందండోయి, మంచి కథలకు మా హర్షాతిథ్యం ఒక వేదిక కావాలని.
చక్కటి ఆలోచన . అమ్మ గురించి చాలా బాగా చెప్పావ్ , హర్షా 👌
మెచ్చుకోండిమెచ్చుకోండి
Breautiful ending
మెచ్చుకోండిమెచ్చుకోండి
thank you . even we liked the way story ended, bringing everything together.
మెచ్చుకోండిమెచ్చుకోండి
చూసారాండీ, చిత్రం. మీరు చక్కగా ఇది చదివి పెడితే వినిపెట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారాండీ, వాళ్ళ లెక్క పిచ్చి రాముడి దగ్గరకు వచ్చి దీన్ని చదివిపెట్టిన వాళ్ళ కంటే చాలా ఎక్కువేనండి. పోనీ ఇలా వినిపెట్టిన వాళ్ళల్లోంచి ఐనా కొద్దిమందే, పాపం వాడిదగ్గర కూడా చదివితే బాగుంటుందీ అనుకున్నారు. అందంగా వినిపించిన మీకూ, దీ వినిపెట్టిన వాళ్ళకీ కూడా బోలెడు ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
‘వరలక్ష్మి గారి కథ’ మా హర్షణీయం జట్టు కంతా, చాలా నచ్చిన కథ సర్. మీ కథని , మా హర్షణీయం ద్వారా వినిపించడానికి , అనుమతి నిచ్చినందుకు, మీకు మా కృతజ్ఞతలు. పిచ్చి రాముడ్ని, మంచి రాముడ్ని చెయ్యకండి. ఇదే బాగుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
To understand the depth of relations one requires age and experience.
This reminds me my own experience. My grandmother use to tell me your generation boys are better than our generation boys. I use to argue with her why my grandfather is a hero to me are you telling he is not good, then she told me go and ask your grand father. I never asked him. When I entered college education and started understanding the society and people , I recalled my grandmother statement and understood it’s real sense. So certain things we can learn over time and age.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Really glad that you could appreciate the way, the writer, brilliantly handled a very intricate relationship, sir.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అనిల్ కుమార్ గారు ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడారు కథ గురించి. వారికి పిచ్చిరాముడి ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
‘నచ్చికోలు’ సర్, మెచ్చికోలు కాదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శాంతారాం గారూ, మీరు ఇంగ్లీషులో వ్రాసినా పిచ్చిరాముడు తెలుగులో జవాబిస్తున్నాడని కోప్పడకండేం. నాకు తెలుగు బాగుంటుంది, సౌకర్యంగా. మీరన్నది నిజమే ఎన్నో సున్నిత మైన విషయాలుంటాయి మనం పెద్దయ్యేదాకా ఆట్టే మన బుర్రలకి అంతగా అవగాహనకు రానివి. ఐతే ఆ అమాయకత్వంలో ఉన్న ఒక ఆనందాన్ని పెద్దయ్యేకొద్దీ ఈ ప్రపంచం మనకు అర్ధం అవుతున్న కొద్దీ పోగొట్టుకుంటూఉంటాం కదా అన్న దిగులూ కలుగుతుంది అప్పుడప్పుడూ. కథ మీకు నచ్చినందుకూ, మంచి పాయింటు స్పర్శించినందుకూ ధన్యవాదాలండీ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
బాగుందండి కధ. ఈ మధ్య చదివిన కధలలో ఎన్నదగినది. చదవాల్సిన బ్లాగుల్లో ఇది ఒకటి.
హర్షాదిత్యం వారికి ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
సుబ్రహ్మణ్యం గారు, ఈకథని ఎన్నదగినది అనేసి పిచ్చి రాముణ్ణి ఆనందపరచారు. ధన్యవాదాలు. మీరు ఇది ఒకటీ అన్నది పిచ్చిరాముడి బ్లాగు అని ఆశపడుతున్నాను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మ తన కొడుకుని ప్రేమతో హృదయానికి హత్తుకున్నట్లు కథ హృద్యంగా మా హృదయానికి హత్తుకుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఈకథ మీకు నచ్చినందుకు చాలా సంతోష మండీ మధుసూదన రాజుగారు. అన్ని ప్రేమల్లోనూ కన్నవాళ్ళ ప్రేమలే కదండీ మిన్న. తతిమ్మా ప్రేమలన్నీ మనం సంపాయించుకునే వైతే, అమ్మానాన్నలు ఎంతో ప్రేమతో మనని సంపాదించుకుని అంతకి వెయ్యింతలుగా నిత్యం చూపిస్తారు కదండీ తరగని ప్రేమని. అందుకే తల్లీబిడ్డల బంధం ఎప్పుడూ మన హృదయాలకి బాగా పడుతుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అనిల్ మరియు హర్ష ఇద్దరు అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు. జట్టు అందరికి నా అభినందనలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
కళ్యాణ్ గారూ, కృతజ్ఞతలు. ఈ కథకు ముందు మాట చక్కగా రాసింది హర్ష, కథ హృద్యంగా రాసింది, పిచ్చి రాముడు గారు (ఆయన కలం పేరు).
మెచ్చుకోండిమెచ్చుకోండి
హర్ష ‘ పిచ్చిరాము ‘ డై , బ్లాగులోకాన్ని
పిచ్చిదాన్ని జేసె , పీక్సు జేర్చె ,
కథనమందు నేర్పు , కథయందు నాణ్యత
గుండె తడిని తడిమె , గొప్ప వాడె .
మెచ్చుకోండిమెచ్చుకోండి
“పిచ్చి రాముడు” పిచ్చి రాముడు గారేనండి.ఆయన అసలు పేరు హర్షణీయానికి తెలీదు. హర్షా మటుకు కాదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి