‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’

ఈ వారం ‘కథా నీరాజనం’ లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ‘ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ‘ అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది,

ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు.

ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన గోదావరి తీరం నేపధ్యం గా ఈ కథ సాగుతుంది.

ఈ కథ , అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన ‘ఖచ్చితంగా నాకు తెలుసు’ అనే వంశీ గారి కథా సంకలనం లోనిది. వంశీ గారు 250కి పైగా కథలు రాసారు. ఈ కథల్లో ఇరవై ఐదు చక్కని కథలను ఆయన ఎంపిక చేసి , ఈ కథా సంకలనం లో చేర్చడం జరిగింది.

ఈ కథలకు బాపు గారు వేసిన బొమ్మలతో అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలాఅందంగా ముద్రించారు. ప్రతి తెలుగువాడి ఇంటి గ్రంధాలయంలో ఉండాల్సిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం కొనదలచుకున్న వారు, క్రింద ఇచ్చిన వెబ్ లింక్ లేదా నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్) అడ్రస్ లను గమనించగలరు.

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

(https://www.facebook.com/AnvikshikiPublishers/)

ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

*Intro-outro BGM Credits:

Mounaragam Theme – Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)

One thought on “‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’

  1. ఎవరీన అనుకుంది ఎనిమిదో క్లాసులో “అవ్వేషణ” సినిమా చూసి దడ పుట్టినప్పుడు. ఆ ముందు రెండు సినిమాల్లోని భావుకత ఆ వయసుకు పెద్దగా ఎక్కలేదు కానీ మెల్లగా ఆయన తెలుగుదనం ఎక్కేసి మహర్షి లోని Sanskrit Disco పాట ప్రయత్నించి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో గుర్తు లేదు. చాలా కధలు బాగున్నా వాటిని మంచి సినిమాలుగా మలచలేకపోయారు అనిపించేది కానీ ఇళయరాజా కోసం తపన పడే నాలాంటి జీవాలకు చాలా గొప్ప పాటల సాయం చేసి మనసు నింపేశారు. మిత్రులు చెప్పింది అక్షరాల నిజం. ఆయన పట్ల గౌరవంతో మనకు మనం ఎన్నో తెచ్చిపెట్టుకున్నవి అనుకున్నా సగటు ప్రేక్షకుడికి మాత్రం పూర్తి సంతృప్తి నాకైతే వంశీ సినిమాల్లో లేక సాహిత్యంలో వివిధ కారణాల వల్ల కనపడలేదు. అయినా ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాలేరు. తెలుగు భాషకు తన వంతు ఊతను అందించిన వంశీగారికి నా కృతఙ్ఞతాభినందనలు 🙏

    మెచ్చుకోండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s