హర్షణీయంలో ‘చినుకు’ల చిరుజల్లు!

హర్షణీయం వెబ్సైటు మొదలై ఆరు నెలలు కావస్తున్నది. మొదటి నెలలో ఇరవై పాఠకుల తో ఆరంభించి , ఈరోజు పబ్లిష్ చేసిన ప్రతి కథనూ, పన్నెండు దేశాలలో వున్న ఐదువందల మందికి పైగా పాఠకులు చదవడం జరుగుతోంది.

మీ అందరి ప్రోత్సాహానికి హర్షణీయం జట్టు హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తోంది.

కేవలం ‘తెలుగు భాష పై ప్రేమ’ అనే మాకున్న ఏకైక అర్హత తో మేము ఈ ప్రయత్నాన్ని ఆరంభించాము.

ఈ ఆరునెలల చిన్ని ప్రయాణం లో ఎందరో తెలుగు ప్రేమికుల్ని , భాషా శ్రామికుల్ని , ‘హర్షణీయం’ కలవడం జరిగింది.

ఒక్క కథా రచన అనే ప్రక్రియలో, కృషి సాగిస్తూ , చక్కని రచనలు చేస్తున్న, తెలుగు రచయితలే ఈరోజు వంద మందికి పైగా వున్నారని, గురు తుల్యులు సుప్రసిద్ధ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు ‘హర్షణీయం’ తో ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

ఇదిగాక తెలుగు సాహిత్యాన్ని, పాఠకులకు దగ్గరగా తీసుకువెళ్లాలి అని నిర్విరామంగా కృషి చేస్తున్న అతి కొద్దిమందిలో చెప్పుకోదగ్గ వ్యక్తి శ్రీ. నండూరి రాజగోపాల్.

లాభాపేక్ష లేకుండా, గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం మీద వుండే మమకారంతో, ‘చినుకు’ అనే మాసపత్రికను, తన సంపాదకీయం లో, ఆధ్వర్యం లో ప్రచురిస్తూ వస్తున్నారు. (పత్రిక పీడీఎఫ్ వెర్షన్ లో కూడా లభ్యమౌతోంది.)

తెలుగు సుప్రసిద్ధ, వర్ధమాన రచయితల, కవుల, కథలు- కవితలతో బాటూ తెలుగు సాహిత్యం పై అనేక విశ్లేషణాత్మక వ్యాసాలను కూడా ఈ పత్రికలో మనం చూడవచ్చు.

హర్షణీయం పాఠకులకు ‘చినుకు’ ల చిరుజల్లు అనుభూతి నివ్వడానికి , మిత్రులు శ్రీ రాజగోపాల్ గారి అనుమతితో ‘చినుకు’ ఈ సంవత్సరం మార్చి సంచికని మీకు ఉచితం గా అందించడం జరుగుతోంది.

ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆయనకు హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

సంచిక పిడిఎఫ్ వెర్షన్ , కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. చందాదారులై ఆయన ప్రయత్నంలో భాగస్వాములు కండి.

సంవత్సర చందా (పన్నెండు సంచికలు ) : మూడు వందల అరవై రూపాయలు మాత్రమే.

మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

‘చినుకు’ పత్రిక చందాలకు :

Google pay & phone pay number

96760 59663

బ్యాంకు వివరాలు – ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెయ్యాలనుకుంటే :

A/c No 0142 111 00000 627
IFSC code: ANDB 0000 142
Andhra Bank
Seetharamapuram Branch

ఇతర వివరాలకు –

ఇమెయిల్ : chinuku2005@gmail.com

మొబైల్ : 76010 12838 – శ్రీ కే యమ్ ఎల్వీ ప్రసాద్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s