
‘కథానవీన్’ గారితో హర్షణీయం ఇంటర్వ్యూలో హర్షణీయం టీం తో బాటూ, ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు పాల్గొనడం జరిగింది. నవీన్ గారికి, నరేంద్ర గారికి కృతజ్ఞతలు.
కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ‘ప్రజాసాహితి ‘ పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం ‘కథ’ అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.
ఈ ఇంటర్వ్యూ లో నవీన్ గారు, తెలుగు కథా సాహిత్యం గురించి , వారు ప్రచురించే ‘కథ’ సంకలనం గురించి మాట్లాడారు. మొత్తం ఆరు భాగాలుగా రాబోయే ఈ ఇంటర్వ్యూ నుంచి, మూడు భాగాలు ఈ వారం మీకు అందిస్తున్నాం.
మొదటి భాగం : ఆధునిక కథ అంటే , తెలుగులో మొట్టమొదటగా వచ్చిన కథల గురించి, మంచి కథ అంటే
రెండవ భాగం : హాస్యం థ్రిల్లర్ కథలు ‘కథ’ వాల్యూమ్స్ లో ఉండని కారణం, ‘కథ’ వాల్యూమ్ లో సెలక్షన్ అఫ్ స్టోరీస్ పై నవీన్ గారి వామపక్ష నేపధ్య ప్రభావం, తెలుగు కథకులు స్పృశించని అంశాలు
మూడవ భాగం: తెలుగు కథలో గత వందేళ్లుగా వచ్చిన మార్పులు, డయాస్పోరా కథల గురించి, నవీన్ గారి తో మధురాంతకం నరేంద్ర గారు.
ప్రసిద్ధ కథకుల కథలు:
ప్రసిద్ధ కథకుల ఇంటర్వ్యూలు:
కథాపరిచయాలు :