‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్ష

వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది.

ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది.

దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ‘ వనవాసి’ నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన.

ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో హర్షణీయం జరిపిన సంభాషణలు (నలభైకి పైగా ) ఈ శబ్ద రూపకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది.

హర్షణీయంలో ఇప్పటిదాకా, ఛత్తీస్గఢ్ లో హస్దేవ్ అరణ్యంలో జరుగుతున్న కోల్ మైనింగ్ వాటి దుష్ప్రభావాలూ , దానిని ఆపడానికి తమ సంస్థద్వారా చేస్తున్న ప్రయత్నం గురించి , శ్రీ ఆలోక్ శుక్లా గారూ, నదుల పునరుజ్జీవనం పై మౌలిక్ సిసోడియా గారు , వనవాసి నవలపై తనదైన విశ్లేషణ తో సత్య శ్రీనివాస్ గారు, తెలుగు రాష్ట్రాలలో ఆదివాసీ హక్కుల గురించి ఈ ఏ ఎస్ శర్మ గారు, శక్తీ ఫౌండేషన్ శివరామకృష్ణ గారు, ఆదివాసీ జీవితాలపై శ్రీ పతంజలి శాస్త్రి గారు, మడ అడవుల పరిరక్షణ పై కృషి చేసిన తూపల్లి రవిశంకర్ గారు మనతో మాట్లాడటం జరిగింది.

ఈ విడత ప్రసారం చెయ్యబోయే భాగాలలో , హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చే’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చే గారు (Ms.Mayalmit Lepche), అలానే అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న కోల్ మైనింగ్ పై పోరాడుతూ కాల్పులకు గురైన ఆగ్నేస్ ఖార్షింగ్ గారు (Ms.Agnes Kharshiing) మనతో సంభాషిస్తారు.

ఈ సంభాషణలన్నిటిలో ప్రతిధ్వనిస్తున్న ముఖ్య అంశాలు :

అటవీ కొండ ప్రాంతాల్లో భూమిని నీటిని హస్తగతం చేసుకుని, గాలిని కలుషితం చేస్తూ, అక్కడి నివసించే వారి చట్టపరమైన హక్కులను కాలదన్ని వారి జీవితాలను ఛిద్రం చేస్తూ నాగరిక ప్రపంచం కడుతున్న హైడ్రో పవర్ డాంలూ , మైనింగ్ కోసం జరుపుతున్న తవ్వకాలూ, దీనివల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తద్వారా వాతావరణంలో వస్తున్న, రాబోయే పెను మార్పులూ.

మనదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నిటిలో, అభివృద్ధి పేరుతో ఇదే రకంగా పర్యావరణ వ్యవస్థ నాశనం కావటం , ప్రకృతి ఆలంబనగా జీవించే వారు తీవ్రమైన ఇబ్బందులకు గురికావటం అనేది చాలా ఆందోళన చెందవలసిన విషయం.

వనవాసి నవలలో ప్రస్తావించిన పర్యావరణ , సామాజిక అంశాలను , ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించడం, ఈ శబ్దరూపకం ద్వారా హర్షణీయం చేస్తున్న ఒక ప్రయత్నం.

ఇంకొన్ని వివరాలు:

హిమాచల్ ప్రదేశ్ లో మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం:

తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్టు సిక్కింలో :

మేఘాలయలో కోల్ మైనింగ్:

https://www.youtube.com/watch?v=Ug2HD5KWUvQhttps://enewsroom.in/meghalaya-coal-illegal-mining-pollution/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s