స్పర్ధయ వర్ధతే విద్య!

ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని. మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా … స్పర్ధయ వర్ధతే విద్య!ని చదవడం కొనసాగించండి

మా ఉలవపాళ్ళ స్వామి!

నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక … మా ఉలవపాళ్ళ స్వామి!ని చదవడం కొనసాగించండి

నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!

మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు !  నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో  వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ … నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!ని చదవడం కొనసాగించండి

మా వాసన్న, మీకు కనపడితే!

మా ఉప్పలపాడు గ్రామం గురించి నేను మీకు ఇది వరకే చెప్పి యున్నాను. ఓ నాలుగు వందల గడపలు ఉన్న గ్రామం మాది. జీవినం అంతా వ్యవసాయాధారమే, వ్యవసాయమంతా వర్షాధారమే. కలిగిరి చెరువునుండి మొదటి పారుదల మాకు. వర్షాలు సమృద్ధిగా వున్నఏడు రెండు పంటలు లేక పోతే రెండేళ్లకు ఓ పంట. బోర్లతో, మోటరులతో వ్యవసాయం మాకు తెలియని విద్య. వూరు మాత్రం మంచి చైతన్యవంతమే. వ్యవసాయం, సంబంధిత సమస్యలు, వ్యవసాయ సంఘాలకు వ్యతిరేక పోరాటాలు, పశుపోషణ, … మా వాసన్న, మీకు కనపడితే!ని చదవడం కొనసాగించండి

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల … నేను, నా ఉషాయణం!ని చదవడం కొనసాగించండి