మనసున్నమా రాజు!

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్. మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే  నవాబ్ … మనసున్నమా రాజు!ని చదవడం కొనసాగించండి

మా స్నేహ రమణీయం!

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో … మా స్నేహ రమణీయం!ని చదవడం కొనసాగించండి

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో. సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా … మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!ని చదవడం కొనసాగించండి

స్నేహనాథుడు మా రఘునాథుడు!

మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది.

మనసున్న మారాజు!

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్.

మా స్నేహ రమణీయం!

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి.

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో.

ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!

మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.

మరవ కూడని వారు!

నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా.

మా వాకాటి కథల్లో, సూరి గాడు!

సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది.

మా వాకాటి కథల్లో అశోక్ గాడు!

మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత వరకు మేమే ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు.

మన వాకాటి కథల్లో గోపీగాడు!

ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక సంపుటిగా తీసుకొద్దాము అని.

మా వాకాటి కథలకు కొనసాగింపు!

"ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్ చేశాము", అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .

మా వాకాటి కథలు

నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం

మా (కానీ) సత్యం!

నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!

నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురుంచి!

నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే … నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురుంచి!ని చదవడం కొనసాగించండి

మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!

నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా.

నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను.

అబద్దం, నిప్పులాంటిది!

అబ్బాయిల్లారా! మీకు అబద్ధం చెబితే ఎలా దొరికి పోతామో అన్నదానిమీద నా అనుభవం  చెప్తా. ఈ మధ్య కాలం లో నా క్లాసుమేట్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది తను ఒక శనివారం ఉదయాన నాలుగు గంటలకు శంషాబాద్ లో దిగుతున్నానని, వచ్చి తనని తీసుకెళ్లి వాళ్ళ మేనమామ ఇంట్లో దిగపెట్టమని. తెగ ఆలోచించేసా ఆ టైంలో ఇంట్లో ఏమి చెప్పి వెళ్లాలా అని. మీకా డౌట్ వద్దు ఆడ స్నేహితమా లేక మగ స్నేహితమా అని. … అబద్దం, నిప్పులాంటిది!ని చదవడం కొనసాగించండి

దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు … దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!ని చదవడం కొనసాగించండి

నా సహోద్యోగులు, హాస్యచతురులు !

మనం వారంలో ఐదురోజులు మరియు రోజుకి కనీసం ఎనిమి గంటలు ఆఫీసుల్లో గడిపేస్తాం. మన కొలీగ్స్ లో హాస్యచతురత ఉంటే పని ఒత్తిడిని తట్టుకోవచ్చు. చతురత దండిగా వుండే ఒకానొక కొలీగ్ సామ్ ప్రదీప్. అప్పుడప్పుడు కలిసి భోజనానికి వెళ్తాము.

క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే!

నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఎదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి.

మా పంచింగ్ ఫలక్ నామ!

నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది.

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!

ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు.