వఱడు – అల్లం శేషగిరి రావు గారు

'వఱడు ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిదిపొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగిందిఅటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.

‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారు

'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి. 'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన … ‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారుని చదవడం కొనసాగించండి

‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు

'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. సుధాకర్ గారి 'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది. మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ. మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల. 'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో … ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారుని చదవడం కొనసాగించండి

‘ ది బ్లూ అంబ్రెల్లా’

పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల. ఈ పుస్తకంనించి, ' ది బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు. ' The Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్. అనిల్ గారు … ‘ ది బ్లూ అంబ్రెల్లా’ని చదవడం కొనసాగించండి

‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన

రిటైరై,  కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా,  చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ,  జీవించడాన్ని ఇష్టపడతారు.  ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే  మనిషి. కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ -  స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే … ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచనని చదవడం కొనసాగించండి

‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.

'సంపెంగ పువ్వు' గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ముందుగా, రజని గారు గోపీచంద్ గారి … ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.ని చదవడం కొనసాగించండి

‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన.

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది. పుస్తకం కొనడానికి కావాల్సిన  web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని … ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన.ని చదవడం కొనసాగించండి

‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు

హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది. … ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారుని చదవడం కొనసాగించండి

వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’

హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు. సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు. … వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’ని చదవడం కొనసాగించండి

‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని … ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!ని చదవడం కొనసాగించండి

‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు - మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link https://bit.ly/3s7mPCW కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల . ఎపిసోడ్లో … ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!ని చదవడం కొనసాగించండి

‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన

‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు  రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది.  తన మూలాలను వెతుక్కుంటూ ఒక మహిళ చేసే  ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత.   విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన  ‘ మూడు బీర్ల తర్వాత’  ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి.  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link ….  https://bit.ly/3d4M0lv  … ‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచనని చదవడం కొనసాగించండి

‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన

చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ … ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచనని చదవడం కొనసాగించండి

మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !

ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు. తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు … మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి

‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !

నవలా రచయితగా లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి 25 ఎంపిక చేసిన కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా.... రాముడొస్తున్నాడోయ్ '. ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ … ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !ని చదవడం కొనసాగించండి

‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!

'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది. ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/patanjali-sahityam-1 తోటి వేటగాళ్లు కథపై శ్రీ మందలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి కృతజ్ఞతలు. తోటి వేటగాళ్ళు ! బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.  దానినీ , … ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!ని చదవడం కొనసాగించండి

‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ

'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి క్రింది ఉన్న లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/sri-channel-2 బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.  ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది. బ్రాహ్మణ వీధిలో ఉన్న పది … ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథని చదవడం కొనసాగించండి

‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’

మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే,, మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. … ‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’ని చదవడం కొనసాగించండి

‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారు

'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు. మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది. మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, … ‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారుని చదవడం కొనసాగించండి

‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ

హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు … ‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథని చదవడం కొనసాగించండి

పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?

ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్ళ జర్నీ … పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?ని చదవడం కొనసాగించండి

‘అహింస’ దాదా హయత్ గారి కథ!

'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై … ‘అహింస’ దాదా హయత్ గారి కథ!ని చదవడం కొనసాగించండి

‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !

రచయిత పరిచయం: వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ … ‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !ని చదవడం కొనసాగించండి

వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!

'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) 'సొట్ట ఆదిగాడు': ఆ వూళ్ళో  వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి … వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!ని చదవడం కొనసాగించండి

సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ 'వేలుపిళ్లై' అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో 'వేలు పిళ్ళై కథలు ' కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది. ************************************** 'ఏనుగుల రాయి': కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు. దొరలు … సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!ని చదవడం కొనసాగించండి