‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

ఈ కథ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది. నైట్ డ్యూటీ “ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”  ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంజ్ లూ , మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సిలిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ … ‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథని చదవడం కొనసాగించండి

‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయం

"The dream reveals the reality which conception lags behind, that is the horror of life and the terror of art" - Franz Kafka (1883-1924) కథ స్థూలంగా: కథలో పాత్రధారులు, భార్య , భర్త , ఓ ఐదేళ్ల కూతురు. కథంతా ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో ఉంటుంది. భార్య ఒక పెయింటర్. ప్రతివిషయాన్నీ వ్యాపార దృక్పధం తో చూసే భర్తా, అతనితో ఆమె గడిపే అసంతృప్తికర జీవితం, … ‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయంని చదవడం కొనసాగించండి

వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’ – ‘నల్లగొండ కథలు’ నుంచి !

ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం. 2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి … వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’ – ‘నల్లగొండ కథలు’ నుంచి !ని చదవడం కొనసాగించండి

‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయం

రోహిణి' పతంజలి శాస్త్రి గారి 'రామేశ్వరం కాకులు' అనే కథాసంకలనం లోనిది. • ఈ కథపై చక్కని సూచనలివ్వడమే కాక, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు. **'రామేశ్వరం కాకులు పుస్తకం' అమెజాన్ లో దొరుకుతోంది. - http://amzn.to/3bFv5W2. కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో … ‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయంని చదవడం కొనసాగించండి

‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథ

*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు. 'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది. ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల … ‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథని చదవడం కొనసాగించండి

అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.

(*కథను ప్రచురించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.) రచయిత అల్లం శేషగిరి రావు గారి గురించి ( 1934 - 2000) - 'చీకటి' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది. 'రచన' మాసపత్రిక లో 1995 లో ప్రచురింపబడ్డ ఈ కథ, ఆయన ఆఖరి రచన. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని … అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.ని చదవడం కొనసాగించండి

‘ఇల్లు’!

ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది. చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను … ‘ఇల్లు’!ని చదవడం కొనసాగించండి

‘వడ దెబ్బ’ !

కథ పేరు 'వడ దెబ్బ'. వడ దెబ్బ “వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు. గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు. ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు. "బండ వెధవల్లారా ! బడుద్ధాయి గాడిదల్లారా … ‘వడ దెబ్బ’ !ని చదవడం కొనసాగించండి

‘నా పేరు సొంబరా ‘ – మల్లిపురం జగదీష్ గారు

హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా' ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.) ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకు మునుపు … ‘నా పేరు సొంబరా ‘ – మల్లిపురం జగదీష్ గారుని చదవడం కొనసాగించండి

పి.రామకృష్ణ గారి కథ – ‘దయ్యం’

'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా. ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు … పి.రామకృష్ణ గారి కథ – ‘దయ్యం’ని చదవడం కొనసాగించండి

‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!

హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం. సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి. కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక … ‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!ని చదవడం కొనసాగించండి

శ్రీరమణీయం – నాలుగో భాగం : వారి కథా రచన

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రిక సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – నాలుగో భాగం : వారి కథా రచనని చదవడం కొనసాగించండి

శ్రీరమణీయం – మూడో భాగం : బాపురమణ గార్లు

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రిక సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – మూడో భాగం : బాపురమణ గార్లుని చదవడం కొనసాగించండి

తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి … తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’ని చదవడం కొనసాగించండి

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి – ‘సిలారు సాయబు’

హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం … ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి – ‘సిలారు సాయబు’ని చదవడం కొనసాగించండి

‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటి

హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన. ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది. ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు. తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , … ‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటిని చదవడం కొనసాగించండి

శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’

"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి . హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'. ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి … శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’ని చదవడం కొనసాగించండి

రావిశాస్త్రి గారి ‘వర్షం’

హర్షణీయానికి స్వాగతం. “ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది, ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది, తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది. తన రచనలకు ప్రదానం చేసిన … రావిశాస్త్రి గారి ‘వర్షం’ని చదవడం కొనసాగించండి

“గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు

'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వేంకటేశ్వరరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వేంకటేశ్వరరావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ … “గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావుని చదవడం కొనసాగించండి

దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’

తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దొంగ' - … దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’ని చదవడం కొనసాగించండి

శ్రీరమణ గారు – బంగారు మురుగు

https://www.amazon.in/MITHUNAM-TELUGU-PB-Sri-Ramana/dp/8172869436/ref=sr_1_8?dchild=1&keywords=midhunam&qid=1602989718&sr=8-8 తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు. బంగారు మురుగు - శ్రీ రమణ గారు రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది. ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో … శ్రీరమణ గారు – బంగారు మురుగుని చదవడం కొనసాగించండి

‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.

రచయిత పరిచయం: తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష, సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన … ‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.ని చదవడం కొనసాగించండి

హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా. ఈ పుస్తకం మొదటి రెండో … హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !ని చదవడం కొనసాగించండి

‘ఓ హెన్రీ స్టోరీ’ – వెంకట్ శిద్ధారెడ్డి గారి ‘సోల్ సర్కస్’ కథాసంకలనం లోంచి!

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది. వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. 2019 వ సంవత్సరంలో … ‘ఓ హెన్రీ స్టోరీ’ – వెంకట్ శిద్ధారెడ్డి గారి ‘సోల్ సర్కస్’ కథాసంకలనం లోంచి!ని చదవడం కొనసాగించండి

సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’

హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, ఏకాదశి చంద్రుడు అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు' అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది. కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా. నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా 'సితార'. ఆ సినిమాలో వంశీ గారి … సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’ని చదవడం కొనసాగించండి