‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’

ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది, ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు. ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన … ‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’ని చదవడం కొనసాగించండి

శ్రీ మధురాంతకం నరేంద్ర గారి ‘కాకులు గ్రద్దలు’ సంక్షిప్తకథ

'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు' కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు. ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక. కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ … శ్రీ మధురాంతకం నరేంద్ర గారి ‘కాకులు గ్రద్దలు’ సంక్షిప్తకథని చదవడం కొనసాగించండి

బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు

ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ మురళి గారి, బ్లాగ్ 'నెమలి కన్ను' పరిచయం చేస్తున్నాం. ఆయన, 2009 వ సంవత్సరం నించి తన బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. తాను స్వయంగా చక్కటి కథలను రాయడమే కాకుండా , తన బ్లాగ్ ద్వారా తెలుగు సాహిత్యంలో చక్కని కథలను, ఎన్నో సంవత్సరాలనుంచీ తన పాఠకులకు పరిచయం చేస్తున్నారు. వాటిల్లో తెలుగు కథల్లో 'స్త్రీ' పాత్రలపై విశ్లేషణ, కన్యాశుల్కం పాత్రలపై వారి వ్యాఖ్యానం ఎన్నదగినవి. అడిగిన తడవునే, తన … బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారుని చదవడం కొనసాగించండి

హృదయస్పందనల చిరు సవ్వడి!

ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ భాస్కర్ రామి రెడ్డి గారి, బ్లాగ్ పరిచయం చేస్తున్నాం. ఆయన, గత పది సంవత్సరాలుగా తన బ్లాగ్ ను చక్కటి, చిక్కటి తెలుగులో, 'హృదయస్పందనల చిరుసవ్వడి' పేరు తో నిర్వహిస్తున్నారు. ఆయన బ్లాగ్ కి లింకుని క్రింద ఇవ్వడం జరిగింది. హర్షణీయం పాఠకులకి, ఒక మంచి అనుభూతిని వారి రచనలు తప్పకుండా మిగులుస్తాయి. బ్లాగ్ లింక్ : http://chiruspandana.blogspot.com/2015/10/blog-post_8.html? 'పిల్లలని కనాలంటే' అనే పేరుతో తన బాల్యపు మధుర స్మృతులు … హృదయస్పందనల చిరు సవ్వడి!ని చదవడం కొనసాగించండి

అతిథి దేవోభవ!

కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ ".ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి … అతిథి దేవోభవ!ని చదవడం కొనసాగించండి

పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!

మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.

నవ్వితే నవ్వండి

హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం.