వనవాసి ధారావాహికలో భాగంగా పర్యావరణంపై ప్రసంగాలు.

అరణ్యాలు ( శ్రీ డీ వీ గిరీష్ ) , చిత్తడినేలలు ( శ్రీ. రితేష్ కుమార్ ) , మడ అడవులు ( కుమారి అజంతా డే ) , సముద్రాలు ( శ్రీ వివేకానందన్ ), - ఆంగ్లంలో

హిమాలయ పర్యావరణం – మానసీ అషేర్ గారు ఆంగ్లంలో

వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు. ఇంకొన్ని వివరాల కోసం : https://www.himdhara.org/ https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas

తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్టు – లెప్చా ఆదివాసీలు (ఆంగ్లంలో)

వనవాసి ధారావాహిక లో భాగంగా ఈ ఎపిసోడ్లో , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు.

‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్ష

వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది. ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది. దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో … ‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్షని చదవడం కొనసాగించండి

నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయం

' వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి , పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి … నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయంని చదవడం కొనసాగించండి

పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపై

హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం … పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపైని చదవడం కొనసాగించండి

విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ

హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ … విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణని చదవడం కొనసాగించండి

వనవాసి – శ్రీ ఆలోక్ శుక్లా గారితో ఇంటర్వ్యూ కోల్ మైనింగ్ దుష్ప్రభావాల గురించి.

వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది.ఇందులో భాగంగాఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' … వనవాసి – శ్రీ ఆలోక్ శుక్లా గారితో ఇంటర్వ్యూ కోల్ మైనింగ్ దుష్ప్రభావాల గురించి.ని చదవడం కొనసాగించండి

‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం

ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,'ఆత్మనొక దివ్వెగా' నవల , 'సెలయేటి సవ్వడి' కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.

‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) .

తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత. శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.

ఎన్ ఎస్ ప్రకాశరావు గారి గురించి వారి సహచరి డాక్టర్ నళిని గారు!

ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. వారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు ఈ ఎపిసోడ్ లో మాట్లాడతారు. డాక్టర్ నళిని గారికి  కృతజ్ఞతలు. 

రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ

ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. 'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - https://amzn.to/3BzBpsO హర్షణీయం ఇంటర్వ్యూ మీరుఎంతకాలంనించీకథలురాస్తున్నారు? … రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణని చదవడం కొనసాగించండి

స వెం రమేష్ గారితో హర్షణీయం

స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.

పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం

అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి … పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయంని చదవడం కొనసాగించండి

కథానవీన్ గారితో హర్షణీయం Part – II

కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ' ప్రజాసాహితి' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన … కథానవీన్ గారితో హర్షణీయం Part – IIని చదవడం కొనసాగించండి

కథానవీన్ గారితో హర్షణీయం Part – I

‘కథానవీన్' గారితో హర్షణీయం ఇంటర్వ్యూలో హర్షణీయం టీం తో బాటూ, ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు పాల్గొనడం జరిగింది. నవీన్ గారికి, నరేంద్ర గారికి కృతజ్ఞతలు. కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. 'ప్రజాసాహితి ' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు … కథానవీన్ గారితో హర్షణీయం Part – Iని చదవడం కొనసాగించండి

రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి

తన డెబ్భైయ్యో ఏట రచనలు మొదలుపెట్టి తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలను అత్యంత ప్రతిభావంతంగా తన రచనల్లో చిత్రీకరించిన దేవులపల్లి క్రిష్ణమూర్తి గారు , ఈ ఇంటర్వ్యూలో తన రచనల గురించి , తనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేక విషయాల గురించీ, సాహితీలోకంలో తన పరిచయాల గురించీ వివరించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం యువ కథా రచయిత మల్లికార్జున్ , హర్షణీయం టీం తో బాటూ క్రిష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం. క్రిష్ణమూర్తి … రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సిని చదవడం కొనసాగించండి

వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!

సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు. ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడతారు. వారివురికీ … వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!ని చదవడం కొనసాగించండి

‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

'ఎదారి బతుకులు' రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు. ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు. గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా 'వెలుగు' మహిళా సంఘాల (SERP - సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక 'నవోదయం'లో విలేఖరి గా పనిచేస్తున్నారు. ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు … ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి

సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!

2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 'సింగమనేని … సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!ని చదవడం కొనసాగించండి

పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?

ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్ళ జర్నీ … పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?ని చదవడం కొనసాగించండి

ఎండపల్లి భారతి గారి ‘ఎదారి బతుకులు’ పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!

ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు. ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు. మార్చి నెలాఖరున భారతిగారి తో ఇంటర్వ్యూ హర్షణీయంలో మీరు వినవచ్చు. 'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDj

‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !

ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , 'వేలుపిళ్లై' రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ … ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !ని చదవడం కొనసాగించండి

సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!

సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ కి తమ తోడ్పాటు నందించిన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు. వంశీ గారు రాసిన 'ఆకు పచ్చని జ్ఞాపకం ' కొనడానికిhttps://www.telugubooks.in/products/aakupachani-gnaapakam?_pos=15&_sid=2844ef7ef&_ss=r 'వంశీ కి నచ్చిన కథలు' కొనడానికి - https://www.telugubooks.in/products/vamsee-ki-natchina-kathalu?_pos=13&_sid=2844ef7ef&_ss=r హర్షణీయం కు … సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!ని చదవడం కొనసాగించండి

వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !

ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట) 'పొగడ పూలు': గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు. రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి. యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే! … వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !ని చదవడం కొనసాగించండి

‘కే ఎన్ వై పతంజలి’ గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!

తెలుగు సాహిత్యం లోని గొప్ప రచయితలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'మోటు మనిషి ', 'తోటి వేటగాళ్లు ', 'సీతమ్మ లోగిలి ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించమని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, ఆడియో … ‘కే ఎన్ వై పతంజలి’ గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!ని చదవడం కొనసాగించండి

డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!

ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు. చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. వాసిరెడ్డి నవీన్ గారి గురించి: 'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో … డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!ని చదవడం కొనసాగించండి

‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!

నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మొదటి భాగం: రెండవ భాగం: https://atomic-temporary-173223651.wpcomstaging.com/2021/01/16/nallagonda/ https://atomic-temporary-173223651.wpcomstaging.com/2021/01/21/nalgonda-comments/ Powered by Hindenburg

‘నల్లగొండ కథలు’ కథాసంకలనం పై అభిప్రాయాలు !

'నల్లగొండ కథలు' కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత 'మునికాంతపల్లి' విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు.

‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

' మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం. ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కతలు - విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ -ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని … ‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.ని చదవడం కొనసాగించండి

సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!

Part I : part II: part III part IV హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది. హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు. ఆర్కియాలజీ … సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!ని చదవడం కొనసాగించండి

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !

తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.  రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ … ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి

‘నా పేరు సొంబరా’ – కథానేపధ్యం – మల్లిపురం జగదీష్ గారు.

'నా పేరు సొంబరా' కథపై ముందుగా మిత్రుడు రవికాంత్ వ్యాఖ్య, తరువాత , రచయిత జగదీష్ గారి కథానేపధ్యంపై వివరణ వినండి. 'హర్షణీయంలో సుప్రసిద్ధ రచయితల కథలు'

శ్రీరమణ గారి ‘మిథునం’ – ఫణి డొక్కా గారి స్వరాన!

కథ పేరు 'మిథునం '. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ. సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు. ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది. ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు … శ్రీరమణ గారి ‘మిథునం’ – ఫణి డొక్కా గారి స్వరాన!ని చదవడం కొనసాగించండి

శ్రీరమణీయం-రెండోభాగం: కవిసామ్రాట్ విశ్వనాథ

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం-రెండోభాగం: కవిసామ్రాట్ విశ్వనాథని చదవడం కొనసాగించండి

శ్రీరమణీయం – మొదటి భాగం : బాల్యం , రచనా జీవితానికి అంకురం

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి … శ్రీరమణీయం – మొదటి భాగం : బాల్యం , రచనా జీవితానికి అంకురంని చదవడం కొనసాగించండి

తిలక్ గారి కథారచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత శ్రీ మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ!

తెలుగు సాహిత్యం లోని గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం … తిలక్ గారి కథారచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత శ్రీ మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ!ని చదవడం కొనసాగించండి

హర్షణీయంలో ‘చినుకు’ల చిరుజల్లు!

హర్షణీయం వెబ్సైటు మొదలై ఆరు నెలలు కావస్తున్నది. మొదటి నెలలో ఇరవై పాఠకుల తో ఆరంభించి , ఈరోజు పబ్లిష్ చేసిన ప్రతి కథనూ, పన్నెండు దేశాలలో వున్న ఐదువందల మందికి పైగా పాఠకులు చదవడం జరుగుతోంది. మీ అందరి ప్రోత్సాహానికి హర్షణీయం జట్టు హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తోంది. కేవలం 'తెలుగు భాష పై ప్రేమ' అనే మాకున్న ఏకైక అర్హత తో మేము ఈ ప్రయత్నాన్ని ఆరంభించాము. ఈ ఆరునెలల చిన్ని ప్రయాణం లో … హర్షణీయంలో ‘చినుకు’ల చిరుజల్లు!ని చదవడం కొనసాగించండి

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – మొదటి భాగం

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచనాశైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధారెడ్డి … హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – మొదటి భాగంని చదవడం కొనసాగించండి

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – రెండవ భాగం

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచనాశైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధారెడ్డి … హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ – రెండవ భాగంని చదవడం కొనసాగించండి

హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలు

డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను పై ఆడియో ద్వారా మీరు వినవచ్చు. ఇంటర్వ్యూ లింక్ ని కూడా క్రింద ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇదే పేజీలో క్రింది భాగంలో … హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలుని చదవడం కొనసాగించండి

హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు

హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం. గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది. దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న … హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారుని చదవడం కొనసాగించండి