‘ట్రిగ్గర్’

https://player.captivate.fm/episode/684c5509-4f7f-45b1-b1ed-95d3a4d39066 ట్రిగ్గర్ అశోకరాజు సోఫాలో  కూచుని కాఫీ తాగుతూ  టీవీ ఆన్ చేసాడు.  ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి   పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద  చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు.  జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు  ప్రేక్షకులకు అందచేస్తున్నారు.  దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న  మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ … ‘ట్రిగ్గర్’ని చదవడం కొనసాగించండి

‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.

ఛాయా మోహన్ గారు రాసిన కథ ఇది. స్వింగ్ ----------------------------- వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది.  పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా  ఉంది. చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది.  ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు.  … ‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.ని చదవడం కొనసాగించండి

వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)

' వర్షంలో పిల్లి' , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన 'Cat in the Rain'. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు. ‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం - పతంజలి శాస్త్రి  (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం - ఎర్నెస్ట్ హెమింగ్వే) ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. … వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)ని చదవడం కొనసాగించండి

పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర

అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో - విభో - కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష. కథలో పాఠకుడి పాత్ర “ నేను రాసేటప్పుడు అంతా … పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్రని చదవడం కొనసాగించండి

అనుకున్నదొకటీ: హర్ష

"అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా" అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య "ఏంది చిన్నాయన మందల" అంటూ పలకరించా. "నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ … అనుకున్నదొకటీ: హర్షని చదవడం కొనసాగించండి

తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్టు – లెప్చా ఆదివాసీలు (ఆంగ్లంలో)

వనవాసి ధారావాహిక లో భాగంగా ఈ ఎపిసోడ్లో , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు.

‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం

ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,'ఆత్మనొక దివ్వెగా' నవల , 'సెలయేటి సవ్వడి' కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.

ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచన

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980)  రాయలసీమలో  కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు  పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.  ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత … ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచనని చదవడం కొనసాగించండి

కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష

కె.సభా (జూలై 1, 1923 - నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో. నరేంద్ర గారికి కృతజ్ఞతలు. సభా గారి కథలు … కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్షని చదవడం కొనసాగించండి

తడిసిన నేల

ముందు ఉన్న  సీట్లు ,   ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో  వెనకనించీ  ముందుకెళ్తున్నాడు రెడ్డి. లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో,  నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న  వాన చినుకులు  హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది.  డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”? “ వానలు గదా …. రోడ్డుగూడా, … తడిసిన నేలని చదవడం కొనసాగించండి

సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష

అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పడి పొయ్యేనా, అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల  కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్,  అలాగే … సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్షని చదవడం కొనసాగించండి

హర్ష రాసిన ‘ఎండమావి’ – సారంగ పత్రిక నుంచి!

ఈ కథ ' ఎండమావి' హర్ష రాసింది , సారంగ' వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. కథ చదవడానికి - https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/ 'హర్షణీయం' పాడ్కాస్ట్ ని 'గానా' (Ganaa) అప్ ద్వారా వినాలంటే -https://gaana.com/podcast/harshaneeyam-season-1 స్పాటిఫై యాప్ లో వినాలంటే -http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే -http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast) హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి -harshaneeyam@gmail.com కు మెయిల్ లేదా '77807 43545 ' అనే … హర్ష రాసిన ‘ఎండమావి’ – సారంగ పత్రిక నుంచి!ని చదవడం కొనసాగించండి

‘ఆర్వీ చారి కరెంటు బిల్లు ‘ ! – పతంజలి శాస్త్రి గారి కథ

ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది. కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది. శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది. ఆర్వీచారి కరెంటు బిల్లు: లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. … ‘ఆర్వీ చారి కరెంటు బిల్లు ‘ ! – పతంజలి శాస్త్రి గారి కథని చదవడం కొనసాగించండి

మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!

"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు "తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు. "నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి" "చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ … మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!ని చదవడం కొనసాగించండి

సాబువ్వ

మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది. "కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే.. నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, … సాబువ్వని చదవడం కొనసాగించండి

ప్రణవం – ప్రణయం – పరిణయం

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు.

లీలా కాలనీ

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది.. డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ. "మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ? "బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ? తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , … లీలా కాలనీని చదవడం కొనసాగించండి

అర్థాంతర ప్రయాణాలు!

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్స్.

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం.

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదట , ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు , మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి కొంచెం ఒంట్లో బాలేదట. " అన్నారు నాన్న.

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.

నా మొదటి ప్రవాస జీవనానుభవం!

నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని.

ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!

మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు.