‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయం

రోహిణి' పతంజలి శాస్త్రి గారి 'రామేశ్వరం కాకులు' అనే కథాసంకలనం లోనిది. • ఈ కథపై చక్కని సూచనలివ్వడమే కాక, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు. **'రామేశ్వరం కాకులు పుస్తకం' అమెజాన్ లో దొరుకుతోంది. - http://amzn.to/3bFv5W2. కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో … ‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయంని చదవడం కొనసాగించండి

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !

తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.  రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ … ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !ని చదవడం కొనసాగించండి

తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి … తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’ని చదవడం కొనసాగించండి

‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటి

హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన. ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది. ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు. తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , … ‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటిని చదవడం కొనసాగించండి